Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదేకు భక్తుడు రూ. 300 కోట్ల భారీ విరాళం

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (16:17 IST)
ఆపద మొక్కులవాడు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి పేదల దగ్గర్నుంచి ధనికుల వరకూ కానుకల రూపంలో తమ మొక్కులు చెల్లించుకుంటూ వుంటారు. లాక్ డౌన్ సడలించిన తర్వాత శ్రీనివాసుడుని దర్శించుకుంటున్న భక్తులు కానుకలను సమర్పించుకుంటున్నారు.
 
తాజాగా ఓ భక్తుడు తితిదేకి రూ. 300 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. తితిదే పరిధిలో నిర్మించ తలపెట్టిన ఆసుపత్రి నిర్మాణానికి అయ్యే రూ. 300 కోట్ల మొత్తం ఖర్చును తనే భరిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.
 
ఇకపోతే ఇటీవలే ఓ తమిళ భక్తుడు ఒకడు కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామికి కోట్లాది రూపాయల విలువే చేసే శంఖుచక్రాలను కానుకగా సమర్పించారు. ఈ శంఖు, చక్రం విలువ రెండు కోట్ల రూపాయలు. వీటిని తమిళనాడుకు చెందిన భక్తుడు సమర్పించారు.
 
ఆ భక్తుడి పేరు తంగదొరు. తేనె జిల్లాకు చెందిన తంగదొరై పరమ స్వామి భక్తుడు. మూడున్నర కిలోల బంగారంతో శ్రీవారికి శంఖు, చక్రాలు చేయించారు. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు చెప్పారు. వీటిని బుధవారం ఉదయం టీటీడీ అదనపు ఈవోకు అందజేశారు. కాగా, తంగదొరై గతంలోనూ శ్రీవారికి బంగారు, వజ్రాభరణాలను విరాళంగా ఇచ్చారు. అందులో బంగారు కటి, వరద హస్తాలు, వడ్డాణం, వజ్రాభరణాలు ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments