Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక ముఖ్యమంత్రి అధికారి, సెక్రటరీని చెప్పన్నా.. చెప్పన్నా అంటే ఏందయ్యా చెప్పేది?

Webdunia
బుధవారం, 26 జూన్ 2019 (13:36 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మాటల తూటాలు ఎక్కుపెట్టారు. టీడీపీ ప్రభుత్వ హాయంలో అవినీతి జరిగిందంటూ జగన్ ప్రచారం చేశారనీ, కానీ ముఖ్యమంత్రి హోదాలో వాస్తవాలు తెలుసుకుని అవాక్కయ్యారన్నారు. 
 
అందుకే అధికారులను, సెక్రటరీలను చెప్పన్నా.. చెప్పన్నా అంటూ పదేపదే అడుగుతున్నారన్నారు. నిజానికి ఏదైనా ఉంటే కదా చెప్పడానికి అంటూ దేవినేని అన్నారు. పైగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి చోటుచేసుకోలేదని దేవనేని స్పష్టం చేశారు. 
 
పైగా, పోలవరం నిర్మాణం పనులు పూర్తికాలేదని గగ్గోలు పెట్టిన జగన్ మోహన్ రెడ్డి... ఇటీవల పోలవరం సందర్శన సమయంలో 70 శాతం మేరకు పనులు పూర్తయివుండటాన్ని చూసి అవాక్కయ్యారన్నారు.
 
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కేవలం కాలువల్లో మట్టిని తీసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. ఈ విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే రాజశేఖర్ రెడ్డి ఆత్మ(కేవీపీ రామచంద్రరావు)ను అడగాలనీ, ఆయన ఢిల్లీలో ఉంటాడని దేవినేని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments