Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబోయ్ డెవిల్ ఫిష్... కృష్ణా పుష్కరాలలో స్నానం సాధ్య‌మా?

విజ‌య‌వాడ : బెజ‌వాడ కృష్ణ‌మ్మకు పుష్కరాలు దగ్గరపడుతున్న వేళ.. పిడుగు లాంటి ఓ వార్త. అటు పుష్కర ప‌నుల్లోని అధికార యంత్రాంగంతో పాటు ఇటు పుష్కరాలకు తరలివచ్చేందుకు సిద్ధపడుతున్న భక్తులను ఆందోళన క‌లిగించే విష‌యమిది. కృష్ణా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన జ

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (13:12 IST)
విజ‌య‌వాడ : బెజ‌వాడ కృష్ణ‌మ్మకు పుష్కరాలు దగ్గరపడుతున్న వేళ.. పిడుగు లాంటి ఓ వార్త. అటు పుష్కర ప‌నుల్లోని అధికార యంత్రాంగంతో పాటు ఇటు పుష్కరాలకు తరలివచ్చేందుకు సిద్ధపడుతున్న భక్తులను ఆందోళన క‌లిగించే విష‌యమిది. కృష్ణా నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన జాలర్లు మోసుకొచ్చిన ఈ భ‌యాన‌క‌మైన విష‌యం అంద‌రికీ ఆందోళన కలిగిస్తుంది. అదే డెవిల్ ఫిష్.
 
కృష్ణా నదీ జలాల్లో ప్రస్తుతం డెవిల్ ఫిష్‌లు ఎంటర్ అయ్యాయట. శరీరం నిండా ముళ్లతో చేపలనే ఆహారంగా తీసుకుంటున్నఈ డెవిల్ ఫిష్‌ల సంఖ్య ప్రస్తుతం వేల సంఖ్యలో నదిలో ఉంద‌ట‌. మొన్నటి దాకా కనిపించని ఈ డెవిల్ ఫిష్... ఇప్పుడెలా ప్రత్యక్షమైందన్న విషయంపై భిన్న వాదనలు వస్తున్నాయి. ఇటీవలే పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు కృష్ణా నదిలో కలువగా.. ఈ నీటి ద్వారానే డెవిల్ ఫిష్ కృష్ణా నదీ జలాల్లోకి ఎంటరై ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
 
కానీ, వాస్త‌వానికి బుడ‌మేరు డైవ‌ర్ష‌న్ కెనాల్ నుంచి ఈ డెవిల్ ఫిష్ కృష్ణ‌లోకి చేరిన‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే కృష్ణా జలాల్లో పెను బీభత్సం సృష్టిస్తున్న డెవిల్ ఫిష్.. మత్స్యకారుల వలలను చీల్చి పారేయడమే కాకుండా జాలర్లను గాయాలుపాలు చేస్తున్నాయట. నదిలోకి చేపల వేటకు వెళ్లాలంటేనే మత్స్యకారులు హడలి పోతున్నారు. ఇక ఈ నీళ్ళ‌లో పుష్క‌ర స్నానం సాధ్య‌మా అంటూ నిర్వాహ‌కులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే, దీనిపై ప్ర‌భుత్వం, మ‌త్య్స్య‌శాఖ స్పందించాల్సి ఉంది.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments