Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయాలకు దూరంగా చిత్తూరు "టైగర్‌"... ఎవరాయన?

"టైగర్‌" ఏంటి.. రాజకీయాలకు దూరంగా ఉండడం ఏంది. అనుకుంటున్నారు కదూ..? నిజమే.. టైగర్‌ అంటే అడవిలో ఉన్న టైగర్‌ కాదు. రాజకీయాల్లో రాణించడం వల్ల సన్నిహితులు పెట్టిన పేరే టైగర్‌.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (12:53 IST)
"టైగర్‌" ఏంటి.. రాజకీయాలకు దూరంగా ఉండడం ఏంది. అనుకుంటున్నారు కదూ..? నిజమే.. టైగర్‌ అంటే అడవిలో ఉన్న టైగర్‌ కాదు. రాజకీయాల్లో రాణించడం వల్ల సన్నిహితులు పెట్టిన పేరే టైగర్‌. మరి ఈ టైగర్‌ ఎవరో కాదు చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సి.కె.బాబు. ఈయన పేరు తెలియని వారు చిత్తూరులోనే కాదు చిత్తూరు జిల్లాలోనే ఎవరూ ఉండరు. అంతటి పేరుగాంచిన రాజకీయ నాయకుడి ఈయన. దివంగత నేత వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి చనిపోక ముందు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న సి.కె.బాబు ఎమ్మెల్యేగా కొనసాగారు.
 
పాత కక్ష్యల నేపథ్యంలో ఈయనపై ఇప్పటికీ ఏడుసార్లు హత్యాయత్నం కూడా జరిగాయి. తృటిలో తప్పించుకుని ప్రాణాలతో బయట పడ్డారు కూడా. ఇంత రాజకీయ చరిత్ర ఉన్న సి.కె.బాబు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అసలు సి.కె.బాబు రాజకీయాలకు దూరంగా ఉండడానికి కారణం ఏమిటి.
 
సి.కె.బాబు. చిత్తూరుకు చెందిన నాయకులందరూ ఈయన్ను టైగర్‌ అని పిలుస్తారు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఆయన చెప్పిందే జరగాలి. అలా అని ఈయనేదో నాలుగైదు పార్టీలు మారారని అనుకోకండి. ఈయన ఒకే ఒక్క పార్టీలో ఉన్నారు. ఆ పార్టీకి ఎమ్మెల్యేగా పనిచేశారు. పార్టీ పరిస్థితి హీనంగా మారిన తరdవాత మిన్నకుండిపోయారు. ఆ పార్టీనే కాంగ్రెస్‌. రాజశేఖర్‌ రెడ్డికి అత్యంత సన్నిహితులు సి.కె.బాబు. ఈయనంటే కూడా వైఎస్‌ఆర్‌కు చాలా ఇష్టం. అభివృద్ధి కార్యక్రమాలేవైనా సరే, ప్రజల కష్టాలు ఏదైనా సరే వాటిని పరిష్కరించందో నిద్రపోడు సి.కె.బాబు. అందుకే ఎప్పుడు సి.కె.ఎమ్మెల్యేగా నిలబడినా ప్రజలు ఆయన్ను ఆదరించేవారు. భారీ మెజారిటీతో గెలిపించేవారు. కులాలు, మతాలకు అతీతంగా ఒక్క చిత్తూరు శాసనసభ ఎన్నికల్లో ఓట్లు పడేవి సి.కె.బాబుకి మాత్రమే.
 
పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం చిత్తూరులో జరగాలన్నా సి.కె.బాబు హస్తం లేనిదే ఏదీ జరిగదు. జరగనివ్వరు. ఆయనకు ఎంత పేరుందో అంతే స్థాయిలో అనుచరులు కూడా ఉన్నాయి. కంటితో సైగ చేస్తే పనులన్నీ చకాచకా చేసి ఆయన ముందు నిలుచుంటారు. పేదవాడు కష్టం అని వస్తే తనకి తోచింది ఇచ్చి పంపించడమే కాదు ఆ పేదవాడికి ఆర్థికంగా దారి కూడా చూపిస్తాడు. అదీ సి.కె.బాబంటే.. ఇదంతా వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి బతికి ఉన్నప్పుడు, సి.కె.బాబు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటి కథ. ఆ తర్వాత కూడా నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి సిఎం పదవిని అప్పజెప్పడం జరిగింది. కిరణ్‌కు అత్యంత సన్నిహితుడు సి.కె.బాబు. దీంతో చిత్తూరు నియోజవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడంలో విజయాన్ని కూడా సాధించారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జరిగిన విషయాలు తెలిసిందే. కిరణ్‌ రాజీనామా చేయడం ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి మరింత హీనంగా మారిపోవడం.  
 
వై.ఎస్‌.ఆర్‌. మరణానంతరం జగన్‌ వైకాపా పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. సి.కె.బాబుకు తన అనుచరుల నుంచే వైకాపాలోకి వెళ్ళాలన్న ఒత్తిడి కూడా పెరిగింది. అంతేకాదు స్వయంగా జగన్‌ పార్టీలోకి సి.కె.ను ఆహ్వానించారు కూడా. కొన్ని రోజుల పాటు పార్టీలో వెళదామా? వద్దా అన్న ఆలోచనలో ఉన్నారు సి.కె. ఆ తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళనేలేదు కదా రాజకీయాలకు దూరమైపోయారు. ప్రస్తుతం ఏ పార్టీలోకి వెళ్ళకూడదన్న నిర్ణయానికి కూడా సి.కె.బాబు వచ్చినట్లు తెలుస్తోంది. సి.కె.బాబు రాజకీయాల్లో లేకున్నా ప్రజలకు మాత్రం సేవ చేస్తూనే ఉన్నారని తెలుస్తోంది. మొత్తం మీద చిత్తూరు రాజకీయాల్లో టైగర్‌గా పేరు సంపాందించుకున్న సి.కె.బాబు రాజకీయాలకు దూరంగా ఉండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments