వలస కార్మికుల జీవనం దుర్భరం.. బావిలో ఏడుగురి మృతదేహాలు

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (12:12 IST)
కరోనా కారణంగా వలస కార్మికుల జీవనం దుర్భరంగా మారింది. వలసకు వెళ్లి లాక్ డౌన్ కారణంగా స్వస్థలాలకు చేరుకున్న కూలీల పరిస్థితి దారుణంగా వుంది. తాజాగా బావిలో వలస కూలీల మృతదేహాలు లభ్యం కావడం వరంగల్ జిల్లాలో సంచలనం సృష్టించింది. పొట్ట చేతపట్టుకుని వచ్చిన వారంతా చనిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
గురువారం నాలుగు మృతదేహాలు లభ్యం కాగా.. తాజాగా మరో మూడు లభించాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. కుటుంబం మొత్తం ఒకేసారి ఇలా బావిలో శవాల్లా కనిపించడం వెనక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వారంతా ఆత్మహత్య చేసుకున్నారా..? లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
బిహార్‌కు చెందిన మక్సూద్‌ (50) కుటుంబం 20 ఏళ్ల క్రితం వరంగల్‌కు వలస వచ్చింది. అక్కడా ఇక్కడా పని చేసుకుంటూ కొన్ని రోజుల క్రితం గీసుకొండలోని గోనే సంచులు తయారు చేసే పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరంతా పరిశ్రమలోనే ఓ గదిలో నివాసం ఉంటున్నారు.

తాజాగా మన్సూద్ అతని భార్య నిషా, ఇద్దరు కొడుకులు, కూతురు, మనవడు బావిలో శవాలై కనిపించారు. వీరంతా మసూద్‌, నిషా, బుషారాకతూన్‌, బేబీ, షకీల్‌, షాబాజ్‌ అలం, సోహైల్ అలంగా గుర్తించారు. పోస్టు మార్టం రిపోర్ట్ రావాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raai Lakshmi :సెక్సువల్‌ హరాస్‌మెంట్‌కు పోరాడిన మహిళ గా రాయ్‌ లక్ష్మీ

Chiranjeevi : అనిల్ రావిపూడి కి షూటింగ్ లో షాక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ?

మేఘన కు నా పర్సనల్ లైఫ్ కు చాలా పోలికలు ఉన్నాయి : రాశీ సింగ్

Balakrishna: ఇదంతా ప్రకృతి శివుని ఆజ్ఞ. అఖండ పాన్ ఇండియా సినిమా : బాలకృష్ణ

ఆదిత్య 999 మ్యాక్స్‌లో మోక్షజ్ఞ.. బాలయ్య కూడా నటిస్తారట.. ఫ్యాన్స్ ఖుషీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments