విజయవాడ జీజీహెచ్‌లో అత్యాధునిక సాంకేతికతో కార్డియాలిజి విభాగం

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (08:06 IST)
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన కార్డియాలిజి, క్యాత్ ల్యాబ్ సేవల విభాగాలను జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ ప్రారంభించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో కార్డియాలిజి సంబంధించి 2డిఎకో, ఇసిజీ/టియంటి, కన్సల్టేషన్ రూమ్, క్యాత్ ల్యాబ్, కార్డిలాక్ కేర్ యూనిట్ వార్డులను కలెక్టర్ ఇంతియాజ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక వైద్య పరికరాలను, సౌకర్యాలను పరిశీలించారు. ఆయా విభాగాల ద్వారా రోగులకు అందించే సేవల వివరాలను కలెక్టర్ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఏ.యండి. ఇంతియాజ్ మాట్లాడుతూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ను నిర్మించుకున్నామని, అయితే కోవిడ్ నేపథ్యంలో దానిని కోవిడ్ వైద్య సేవల కోసం వినియోగించుకోవడం జరిగిందన్నారు.

అయితే ఈ రోజు ఒక బ్లాక్ లో కార్డియాలిజి, క్యాత్ ల్యాబ్ సేవల విభాగాలను ప్రారంభించుకోవడం అనందాయకమన్నారు. కోవిడ్ రోగుల్లో గుండెకు సంబంధించి వ్యాధులున్న వారికి ఈ విభాగంలో వైద్య సేవలు అందించవచ్చన్నారు. తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల తరువాత విజయవాడలో అటోమెటిక్ సిస్టమ్ తో అత్యాధునిక వైద్య సాంకేతికతో గుండె వైద్య పరీక్షలు నిర్వహించేందుకు అన్ని సదుపాయలు అందుబాటులోకి వచ్చాయన్నారు.

దీనిమూలంగా రోగికి గుండె పరీక్ష చేసి ఎన్ని బ్లాకులు ఉన్నాయి, స్టంట్ వేయవలసి వుందా, కండరాల సామర్థ్యత తెలుసుకోవడం, బైపాస్ సజ్జరీ అవసరమానే విషయాలు అత్యాధునిక వైద్య పరికరాలు ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఈ విభాగం ద్వారా కలిగిందన్నారు. ఈ కేంద్రాన్ని సేఫ్ న్యూట్రియంట్స్ ప్రైవేటు లిమిటెడ్ తో కలసి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

దీనివల్ల కృష్ణాజిల్లా వాసులకు మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. కార్యక్రమంలో వైద్య విద్యా సంచాలకులు డా.కె. వెంకటేష్ ఆసుపత్రి సూపరింటెండెంట్ శివశంకర్, డిప్యూటి సుపరింటెండెంట్ డా. డి.వెంకటేశ్వరరావు, ఆర్యంఓలు డా. ద్వారంహనుమంతరావు, డా. శోభ పలువురు వైద్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments