Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక హోదా కోసం శ్రీకాకుళం వాసి ఆత్మబలిదానం

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (15:34 IST)
విభజన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లా వాసి ఒకరు ఆత్మబలిదానానికి పాల్పడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా ధర్మపోరాట దీక్ష సోమవారం జరుగుతోంది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ దీక్ష జరుగనుంది. 
 
ఈ దీక్షలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్ళిన శ్రీకాకుళం జిల్లా కింతలికి చెందిన దవళ అర్జున్ రావు ఆత్మహత్య చేసుకున్నాడు. ఏపీ భవన్ సమీపంలోని జశ్వంత్ సింగ్ రోడ్డు ఫుట్ పాత్‌పై ఉదయం 7 గంటల ప్రాంతంలో అర్జున్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అతని దగ్గర నుంచి సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నోట్ తెలుగులో రాసి ఉందని పోలీసులు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్యకు పాల్పడినట్టు లేఖలో అర్జున్ పేర్కొన్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

Srileela: రష్మిక డేట్స్ కుదరక రాబిన్‌హుడ్ చేయలేదు, కాలేజీ రూల్స్ ప్రకారం వెళుతున్నా : శ్రీలీల

Vijay Deverakond: హోం టౌన్ ట్రైలర్ రిలీజ్ చేసి బెస్ట్ విశెస్ చెప్పిన విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

తర్వాతి కథనం
Show comments