Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్మగడ్డకు ఢిల్లీ పిలుపు?

Webdunia
శనివారం, 21 నవంబరు 2020 (07:00 IST)
ఏపీలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమీషనర్ గా ఉండటం రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందిగా ఉన్న అంశంగా చెప్పాలి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాట వింటే చాలు ఏపీ ప్రభుత్వ పెద్దలు పూనకం వచ్చినట్టు ఊగిపోతున్నారు.

ఆయన విషయంలో చాలా సీరియస్‌గా ఉన్న సిఎం జగన్ అయితే ప్రధాన కార్యదర్శిని కూడా కట్టడి చేస్తున్నారు. ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది అనే చెప్పాలి. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
 
దీనిపై ఇప్పుడు నిమ్మగడ్డ కాస్త సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే ఆయన గవర్నర్ కి కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికల నిర్వహణ విషయంలో ఆయనను రాష్ట్ర సర్కార్ అడ్డుకుంటుంది. అయితే ఇప్పుడు నిమ్మగడ్డకి కేంద్ర ఎన్నికల సంఘం పెద్దల నుంచి పిలుపు వచ్చిందని సమాచారం.

మార్చ్ లో ఎన్నికలను వాయిదా వేసిన నాటి నుంచి ఎవరు ఏది మాట్లాడారు…? అధికారులు ఎవరు సహకరించలేదు…? ఆర్డినెన్స్ ఏ విధంగా తీసుకొచ్చారు…? ఆర్డినెన్స్ లో పొందు పరిచిన అంశాలు ఏంటీ…?
 
ఇప్పుడు హైకోర్ట్ ఆదేశాల తర్వాత మీ మీద విమర్శలు వ్యక్తిగత ఆరోపణలు చేసిన వారు ఎవరు…? మీరు సమావేశం నిర్వహించాలి అని భావిస్తే సహకరించని అధికారులు ఎవరు…? మీరు లేఖలు రాసినా ఆదేశాలు ఇచ్చినా సరే స్పందించని అధికారులు ఎవరు…? మీరు గవర్నర్ కి చేసిన ఫిర్యాదులో ఏం ఏం ప్రస్తావించారు…?

రాష్ట్రంలో ఇతర ఎన్నికల అధికారులు ఎవరు ఎవరు మీకు సహకరించడం లేదు…? ఈ అంశాలకు అన్ని సమాధానాలు సిద్దం చేసుకుని డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ రావాలని ఆదేశాలు వచ్చినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments