Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో విద్యార్థులకు దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌ ద్వారా టీవీ క్లాసులు

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (12:13 IST)
కోవిడ్-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఏపీలో విద్యార్థుల చ‌దువుల‌కు ఆటంకుం లేకుండా ఉండేందుకు 1-10 తరగతులకు దూరదర్శన్‌ సప్తగిరి ఛానల్‌ ద్వారా పాఠాలు ప్రసారం చేయనున్నారు. 1-5 తరగతులకు బ్రిడ్జి కోర్స్, 6-9 క్లాసెస్ స్టూడెంట్ల‌కు సబ్జెక్టు లెస‌న్స్ బోధిస్తారు. పిల్లలకు వచ్చే డౌట్స్ క్లారిఫై చేసేందుకు టీచ‌ర్స్ వారానికి ఒక‌సారి పాఠశాలలకు రానున్నారు. టీవీ పాఠాలపై ఏవైనా సందేహాలు వస్తే విద్యార్థులు ఆ రోజుల్లో స్కూల్స్‌కు రావచ్చు.
 
1 నుంచి 5వ త‌రగ‌తి స్టూడెంట్స్ కోసం స్పెష‌ల్‌గా రూపొందించిన‌ బ్రిడ్జి కోర్సు పుస్తకాలను వారికి అందించనున్నారు. ఇంగ్లీషు మీడియం విధానంలోనే ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు సబ్జెక్టులు బోధిస్తారు. 1, 2 తరగతులకు ఉదయం 11 గంటల నుంచి 11.30 గంటలు, 3, 4, 5 తరగతులకు 11.30 గంటల నుంచి 12 గంటల వరకు క్లాసెస్ ఉంటాయి. 6-9 తరగతులకు అన్ని సబ్జెక్టులను చెబుతారు. 
 
6, 7 తరగతులకు మధ్యాహ్నం 2గంటల నుంచి 3గంటల వరకు, 8, 9 తరగతులకు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు టెలికాస్ట్ అవుతాయి. జూన్‌ నెల చివరి వరకు ఈ క్లాసెస్ నిర్వహిస్తారు. టెన్త్ విద్యార్థులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న రెండు గంటల కార్యక్రమాన్ని కొనసాగిస్తారు.
 
1-5 క్లాసెస్ కు పాఠాలు బోధించే టీచ‌ర్స్ విద్యార్థులకు వచ్చే డౌట్స్ క్లారిఫై చేసేందుకు ఈ నెల 16 నుంచి ప్రతి మంగళవారం పాఠశాలకు హాజరుకావాలి. 6-7 తరగతుల హెచ్.ఎమ్, టీచ‌ర్స్ 17వ తేదీ నుంచి ప్రతి బుధవారం పాఠశాలలకు వెళ్లాలి. 8-9 తరగతులకు పాఠాలు చెప్పే టీచ‌ర్స్ 19 నుంచి ప్రతి శుక్రవారం పాఠశాలకు హాజరు కావాలి. పదో తరగతి ఉపాధ్యాయులు ప్రతి బుధవారం, శుక్రవారం స్కూళ్ల‌కు వెళ్లాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"గేమ్ ఛేంజర్" టీజర్‌ను ఏయే థియేటర్లలో రిలీజ్ చేస్తారు?

పుష్ప-2 నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కనబెట్టేశారా? కారణం?

పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments