Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడలో దాండియా, గార్భా మెగా ఈవెంట్

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (21:24 IST)
గార్భా, దాండియా నృత్యరీతుల కార్యశాల రిజిస్ట్రేషన్లకు మంచి స్పందన లభిస్తుందని క్రియేటివ్ సోల్ వ్యవస్థాపకులు సుమన్ మీనా, నేహా జైన్ తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్ర్ర్రక్రియ ఇప్పటికే ప్రారంభంకాగా, వర్క్ షాపును ఈ నెల ఎనిమిదవ తేదీ నుండి 23వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. బెంజ్ సర్కిల్ సమీపంలోని జ్యోతి కన్వెన్షన్ సెంటర్లో  ఉదయం 11 గంటల నుండి ఒంటి గంట వరకు, సాయంత్రం 4 గంటల నుండి  రాత్రి 9 గంటల వరకు సాగే శిక్షణలో ఏదేని గంట నిడివిని ఔత్సాహిక కళాకారులు ఎంపిక చేసుకుని శిక్షణ పొందవచ్చన్నారు.


ప్రధాన ప్రయోజకులుగా జిఎం మాడ్యులర్  వ్యవహరిస్తుండగా 8,9 తేదీలలో సాయంత్రం ఆరు గంటలకు ప్రత్యేక దాండీయా ప్రదర్శన ఉంటుందన్నారు. సాధారణంగా ఉత్తర భారత దేశానికే పరిమితం అయిన గార్బా, దాండియా నృత్యరీతులను ఆంధ్రప్రదేశ్‌కు పరిచయం చేసే క్రమంలో తాము ఈ వర్క్ షాపును నిర్వహిస్తున్నామన్నారు.

 
దసరా వేడుక సందర్భంగా జరిగే  మెగా ఈవెంట్లో దాండియా, గర్బా నృత్యాలతో పాటు గుజరాతీ సంగీత కళాకారులు పాటలు, వాద్య కళాకారులు వీనుల విందైన సంగీతం అందిస్తారని సుమన్ మీనా పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 8008268885, 8121135980 నెంబర్లతో సంప్రదించవచ్చని నేహా జైన్ తెలిపారు. మెగా ఈవెంట్ ప్రవేశం కోసం ఎంట్రీ టిక్కెట్లను జ్యోతి కన్వెన్షన్ సెంటర్ నుండి ప్రతి రోజూ సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల వరకు పొందవచ్చని, 23వ తేదీ సాయంత్రం వరకు ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపారు. శిక్షణ కోసం గుజరాత్ నుండి ప్రత్యేకంగా శిక్షకులు వస్తున్నారని నిర్వాహకులు వివరించారు. కళలతో దేశసమైఖ్యతను చాటేలా గుజరాతీ, రాజస్థానీ పడతులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మూడు సంవత్సరాల పాటు నగర వాసులు మంచి సహకారం అందించారన్నారు.

 
కరోనా వల్ల గత రెండు సంవత్సరాలు విరామం తీసుకోగా, ప్రస్తుతం నాలుగో ఎడిషన్‌కు సన్నద్దం అవుతున్నామని నేహా జైన్ వివరించారు. విజయవాడ యువత కోసం ప్రత్యేకంగా 15 రోజుల పాటు దాండియా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.  ప్రదర్శనకారులలో పోటీతత్వాన్ని పెంపొందిస్తూ, ఉత్సాహభరిత ప్రదర్శనలను ప్రోత్సహించే క్రమంలో నిపుణత ప్రదర్శించిన కళాకారులకు బహుమతులను అందిస్తున్నామన్నారు. దుర్గాదేవికి మహిషాసురునికి మధ్య జరిగే యుద్దానికి ప్రతీకగా ఉత్తర భారత దేశంలో దాండియా అడతారని, అమ్మవారికి హారతి ఇచ్చే ముందు చిన్నా, పెద్ద కలిసి ఈ నృత్యం చేస్తారని సుమన్ మీనా వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: నాని నటిస్తున్న ది ప్యారడైజ్ అప్ డేట్ లెజెండరీ నటుడు గురించి రాబోతుందా...

Naveen Polishetty: బంగారు ఆభరణాల స్పూఫ్ తో అనగనగా ఒక రాజు రిలీజ్ డేట్

YVS: మాతృ మూర్తి రత్నకుమారి అస్తమం పట్ల వై వీ ఎస్ చౌదరి జ్నాపకాలు

Dirictor Sujit: రామ్ చరణ్ కు సుజిత్ చెప్పిన కథ ఓజీ నేనా..

ప్రేయసి కి గోదారి గట్టుపైన ఫిలాసఫీ చెబుతున్న సుమంత్ ప్రభాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

భారతీయ రోగులలో ఒక కీలక సమస్యగా రెసిస్టంట్ హైపర్‌టెన్షన్: హైదరాబాద్‌ వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments