ప్రతి ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని సాంకేతిక విద్యా శాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి అన్నారు. నగరంలోని గాయత్రి నగర్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు నూతనంగా ఏర్పాటు చేసిన శాఖను బుధవారం నాగరాణి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ నగరాలతో పాటు మారుమూల గ్రామీణ ప్రాంతాలకు కూడా ప్రవేటు బ్యాంకింగ్ సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు. బ్యాంకు సర్కిల్ హెడ్ శంకర్ ముత్యం మాట్లాడుతూ హెచ్‌డిఎఫ్‌సి తన వినియోగదారులకు ప్రపంచ స్థాయి బ్యాంకింగ్ సేవలను అందిస్తుందన్నారు.
గాయత్రీ నగర్ బ్రాంచ్ విజయవాడలో 26వ శాఖకాగా, ఆంధ్రప్రదేశ్‌లో 269వ శాఖగా ఉందన్నారు. నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు వినియోగదారులు , సిబ్బంది పాల్గొన్నారు.