Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ కుమార్తెను అందలమెక్కించిన ప్రధాని నరేంద్ర మోడీ

స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని ప్రధాని నరేంద్ర మోడీ అందలమెక్కించారు. ఆమెకు ఎయిరిండియాలో స్వతంత్ర హోదాతో కూడిన డైరెక్టరుగా నియమించారు. ఈ మేరకు పౌర విమానయాన శాఖ ప్

Webdunia
శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (16:33 IST)
స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె, కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరిని ప్రధాని నరేంద్ర మోడీ అందలమెక్కించారు. ఆమెకు ఎయిరిండియాలో స్వతంత్ర హోదాతో కూడిన డైరెక్టరుగా నియమించారు. ఈ మేరకు పౌర విమానయాన శాఖ ప్రతిపాదనకు క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలుపడంతో ఆమెను లక్కీ ఛాన్స్ వరించింది.
 
ఈ పదవిలో ఆమె మూడేళ్ళ పాటు కొనసాగుతారు. డీపీటీఓ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. కాగా, ప్రస్తుతం ఎయిర్ ఇండియాకి నలుగురు స్వతంత్ర డైరక్టర్లు ఉన్నారు. అందులో ఐటీసీ ఛైర్మన్ వైసీ దేవేశ్వర్‌తో పాటు ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా కూడా ఉన్నారు. 
 
2004లో 14వ లోక్‌సభకు ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికైన పురందేశ్వరి అప్పుడు న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు. అలాగే 15వ లోక్‌సభకు కూడా రెండవసారి ఎన్నికై మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 
 
2014లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2015లో బీజేపీ మహిళా మోర్చా ఇన్‌ఛార్జిగా కూడా దగ్గుబాటి పురంధేశ్వరి కొనసాగుతున్నారు. 2004 సంవత్సరానికి గాను ఏషియన్ ఏజ్ పత్రిక పురందేశ్వరిని ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుతో సత్కరించింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments