Cyclone Montha: 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు

సెల్వి
సోమవారం, 27 అక్టోబరు 2025 (21:06 IST)
తుఫాను మొంథా తీవ్రతరం కానుందని అంచనా వేస్తున్నందున, అక్టోబర్ 28న విశాఖపట్నంకు వెళ్లే, ఇంకా అక్కడి నుంచి బయలుదేరే 42 ఇండిగో, 12 ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు చేయబడ్డాయి. ఈ మేరకు విమానాశ్రయ డైరెక్టర్ ఎన్. పురుషోత్తం మాట్లాడుతూ, మేము పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నాము  సేవలను తిరిగి షెడ్యూల్ చేయడానికి, ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి విమానయాన సంస్థలతో సమన్వయం చేస్తున్నాము.. అని అన్నారు. 
 
అక్టోబర్ 27న ఉదయం ఢిల్లీ నుండి బయలుదేరిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో భువనేశ్వర్‌కు మళ్లించబడింది. అయితే అది తరువాత వైజాగ్‌కు తిరిగి వచ్చింది. విజయవాడ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం IX-2743 రద్దు చేయబడింది.
 
ఇంకా ఇండిగో వైజాగ్-బెంగళూరు సేవ నిలిపివేయబడింది. విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిరోజూ దాదాపు 60 విమానాలను నడుపుతూ, నగరాన్ని 13 దేశీయ, రెండు అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానిస్తుంది. దీని వలన వందలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 
 
విమానాశ్రయానికి వెళ్లే ముందు విమానయాన సంస్థలతో విమాన స్థితిని తనిఖీ చేయాలని, అనవసరమైన ప్రయాణాలను నివారించాలని, అధికారిక వాతావరణ సలహాలను పాటించాలని పురుషోత్తం ప్రయాణికులకు సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీ స్రవంతి మూవీస్ ద్వారా తెలుగులో ప్రణవ్ మోహన్ లాల్.. డియాస్ ఇరాయ్

Samantha: స‌మంత‌ నిర్మాతగా మా ఇంటి బంగారం ప్రారంభ‌మైంది

JD Laxman: యువతరం ఏది చేసినా ప్యాషన్ తో చేయాలి : జే.డి. లక్ష్మీ నారాయణ

Chiru song: మన శంకరవరప్రసాద్ గారు ఫస్ట్ సింగిల్ 36 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్‌

Naga Shaurya : అందమైన ఫిగరు నువ్వా .. అంటూ టీజ్ చేస్తున్న బ్యాడ్ బాయ్ కార్తీక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments