Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు : పవన్ కళ్యాణ్

Webdunia
మంగళవారం, 31 అక్టోబరు 2023 (14:30 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆయన మంగళవారం సాయంత్రానికి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ పరిణామాలపై పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 
 
"తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుగారికి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషం. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం, ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు గారి విడుదల కోసం కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందరం ఆయనను స్వాగతిద్దాం" అంటూ పేర్కొన్నారు.

చంద్రబాబుకు ముందస్తు బెయిల్ రావడం శుభపరిణామం : దగ్గుబాటి పురంధేశ్వరి 
 
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముందస్తు బెయిల్ రావడం శభపరిణామనని బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంగళవారం నెల రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన సాయంత్రానికి రాజమండ్రి జైలు నుంచి విడుదలకానున్నారు. 
 
దీనిపై దగ్గుబాటి పురంధేశ్వరి స్పందిస్తూ, చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన విధానాన్ని తాము మొదటి నుంచి తప్పుబడుతున్నామన్నారు. నోటీసులు ఇవ్వకుండా, విచారణ జరపకుండా అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు. ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండానే ఎలా అరెస్టు చేస్తారని విమర్శించారు. బాబుకు బెయిల్ రావడం మంచి పరిణామన్నారు. 
 
పమరోవైపు, వైకాపా ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. నాణ్యతలేని మద్యాన్ని అమ్ముతూ ప్రజల ఆరోగ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తుందని మండిపడ్డారు. మద్యం అమ్మకాల ద్వారా జేబులు నింపుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె దుయ్యబట్టారు. 
 
మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి : చంద్రబాబు లాయర్లు 
 
మద్యం కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై ఏసీబీ కోర్టు విచారణ జరుపనుంది. మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నాలుగు వారాల పాటు ఆయన ఈ మధ్యంతర బెయిల్ వర్తిస్తుంది. ఆ తర్వాత నవంబరు 28వ తేదీ సాయంత్రం నాలుగు గంటల లోపు రాజమండ్రి జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలి హైకోర్టు షరతు విధించింది. 
 
అలాగే, ఈ కేసు గురించి లేదా కేసును ప్రభావితం చేసే విధంగా నడుచుకోరాదని స్పష్టం చేసింది. అలాగే లక్ష రూపాయల పూచీకత్తుపై రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఇద్దరు టీడీపీ నేతలు ష్యూరిటీ ఇవ్వడంతో చంద్రబాబు మంగళవారం సాయంత్రం 4 గంటలకు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. 
 
ఇదిలావుంటే, స్కిల్ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందని ఏపీ ప్రభుత్వం ముందుగానే భావించి ఆయన్ను ఇబ్బంది పెట్టేందుకు మరో కేసును సిద్ధం చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమలు ఇచ్చారంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయనను ఏ3గా చేర్చి, ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. 
 
ఏపీ సీఐడీ నమోదు చేసిన ఈ మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని హైకోర్టు విచారణకు స్వీకరించింది. కాగా, ప్రభుత్వం మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చిందని సీఐడీ ఆరోపిస్తుంది. ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ యాక్ట్ కింద మాజీ సీఎం చంద్రబాబుపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur: ఆన్‌లైన్‌లో ట్రెండ్ అవుతున్న మృణాల్ ఠాకూర్ పేరు.. ఎలాగంటే?

పగ, అసూయ, ప్రేమ కోణాలను చూపించే ప్రభుత్వం సారాయి దుకాణం

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు 9 కొత్త సీజన్ : కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. ఏంటవి?

Pawan: ఎన్టీఆర్, ఎంజీఆర్ ప్రేరణతో పవన్ కళ్యాణ్ పాత్రను రూపొందించా: జ్యోతి కృష్ణ

సయారా తో ఆడియెన్స్ ఆషికి రోజుల్ని తలుచుకుంటున్నారు : మహేష్ భట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments