Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కోటి మందికి పైగా కొవిడ్ టీకాలు

Webdunia
బుధవారం, 2 జూన్ 2021 (12:25 IST)
కొవిడ్ వ్యాధి నివారణా చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో మైలురాయిని అధిగమించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,00,74,471 మందికి  మొదటి, రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు 98,85, 650 డోసులు అందాయన్నారు. ఇందులో కేంద్రం నుండి కోవిషీల్డ్ వ్యాక్సిన్ 66,82,570 డోసులు, కోవాగ్జిన్ 15,17,450 డోసులు అందగా, రాష్ట్ర ప్రభుత్వం 13,41,700 కోవిషీల్డ్ డోసులు, 3,43,930  కోవాగ్జిన్  డోసులు కొనుగోలు చేసిందని ఆయన తెలిపారు.

ఇప్పటి వరకూ కోవిషీల్డ్ వ్యాక్సిన్ 82,95,973 మందికి, కోవాగ్జిన్ 17,78,218 మందికి వేయించామని ఆయన వివరించారు. ఇందులో మొదటి డోసు టీకా వేసుకున్నవారు 75,45,304 మంది, రెండు డోసులూ వేసుకున్నవారు 25,29,167 మంది ఉన్నారని కాటంనేని పేర్కొన్నారు.

మొత్తం 98,85, 650 డోసులను హెల్త్ కేర్ వర్కర్లు ఎక్కడా వృధాకాకుండా టీకా వేయడంవల్ల అదనంగా సుమారు 2లక్షల మందికి టీకా అందించగలిగామని.. దీంతో రాష్ట్రంలో టీకాలు తీసుకున్న వారి సంఖ్య 1,00,74,471 మందికి చేరిందని  తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిచ్చా సుదీప్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మ్యాక్స్ సిద్దమైంది

ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జాస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ కిష‌న్ హీరో

రానా హాజరయ్యే గ్యాదరింగ్స్ లో శ్రీలీల తప్పనిసరి ఎందుకోతెలుసా

పుష్ప సాధారణ సినిమానే, కానీ ప్రేక్షకల ఆదరణతో గ్రాండ్ గా పుష్ప-2 చేశాం : అల్లు అర్జున్‌

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments