Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ చైతన్యా విద్యా సంస్ధలలో రూ.100 కోట్ల విలువైన సాప్ట్ వేర్, నగదు చోరి

Advertiesment
Software
, శనివారం, 29 మే 2021 (22:51 IST)
విజయవాడ: కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామంలోని శ్రీచైతన్య విద్యాసంస్ధలలో {పునాదిపాడు క్యాంపస్}వంద కోట్ల విలువైన సాఫ్ట వేర్ చోరి అయ్యింది. కంకిపాడు పోలీసులు కధనం ప్రకారం ఛైతన్యా విద్యాసంస్ధల నిర్వహణ కోసం సుమారు రూ.100 కోట్ల విలువైన సాఫ్ట్వేర్‌ను యాజమాన్యం వినియోగిస్తుంది. మరెవరు తమ సమాచారం సంగ్రహించే అవకాశం లేకుండా అన్ని భద్రతలతో రూపొందించిన సాప్ట్ వేర్ ను సంస్ధ కొనుగోలు చేసింది.

అయితే ఇటీవల సంస్ధకు చెందిన సాప్ట్వేర్ పని చేయకపోవటం, విధ్యార్ధుల వివరాలు, నగదుకు సంబంధించిన వివరాలలో సమగ్రత లోపించటంతో  అనుమానం వచ్చిన సిబ్బంది లోతుగా అధ్యయనం చేసారు. ఈ వ్యవహారంపై కళాశాల యాజమాన్యానికి పూర్వ సిబ్బందిపై అనుమానం రావటంతో తదనుగుణంగా కంకిపాడు పోలీసులకు పిర్యాధు చేసారు.

గతంలో కళాశాలలో ఎక్జిక్యూటివ్ డీన్ హోదాలో పనిచేసిన నరేంద్రబాబు, డీన్ శ్రీనివాసరావు, బాలకృష్ణ ప్రసాద్ లపై తమకు అనుమానం ఉందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యార్ధులకు సంబంధించిన డేటాను సైతం తస్కరించారని, ఆ డేటా ఆధారంగా పెనమలూరులో శ్రీ  గోస లైట్స్ మెడికల్ అకాడమీ పేరిట మరొక విద్యాసంస్ధను ఏర్పాటు చేసుకుని తమ విద్యార్ధుల తల్లి దండ్రులకు ఫోన్లు చేస్తూ వారికి తక్కువ ఫీజులు తీసుకుంటామని చెబుతున్నారు.

సదరు విద్యార్ధుల తల్లిదండ్రులే ఈ విషయాన్ని చైతన్యా విద్యాసంస్ధల దృష్టికి తీసుకు రావటంతో ఆందోళనకు గురైన యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ప్రస్తుత కళాశాల ఎజిఎం మురళీ కృష్ట కంకిపాడు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాలనలో జగనన్న మహాద్భుతం: రోజా వ్యాఖ్యలు