Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రాలో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు..

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (13:56 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. విజ‌య‌వాడ‌కు చెందిన 28 ఏండ్ల యువ‌కుడికి క‌రోనా పాజిటివ్ అని తేలింది. అలాగే, వైజాగ్‌లో మరో కేసు వెలుగు చూసింది. దీంతో ఏపీలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12కి చేరింది. 
 
ఈ నెల 18న స్వీడ‌న్ నుంచి వ‌చ్చిన అత‌డు ఢిల్లీ మీదుగా విజ‌య‌వాడ‌కు చేరుకున్నాడు. క‌రోనా ల‌క్ష‌ణాల‌తో విజ‌య‌వాడ జీజీహెచ్‌లో చేరాడు. అతనికి కరోనా పరీక్షలు చేయగా, పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేర‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వైద్య ఆరోగ్య‌ శాఖ ప్ర‌త్యేక బులిటెన్ విడుద‌ల చేసింది. 
 
అలాగే, విశాఖకు చెందిన కరోనా పాజిటివ్‌ వ్యక్తి బంధువుకు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వార్తలు వస్తున్నాయి. బర్మింగ్‌హమ్‌ నుంచి వచ్చిన వ్యక్తితో లోకల్‌ కాంటాక్ట్‌ అయిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది.
 
ఈనెల 17న ఆ వ్యక్తి విశాఖపట్నం వచ్చారని 21న ఆస్పత్రిలో వైద్య పరీక్షల నిమిత్తం చేరారని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 384 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 317 మందికి నెగిటివ్‌ రాగా 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments