Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారిని న్యాయవ్యవస్థ ఎప్పటికీ రక్షించదు: జస్టిస్​ ఎన్​వీ రమణ.

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (17:09 IST)
అధికార పార్టీ అండతో చెలరేగే పోలీసులను న్యాయవ్యవస్థ ఎప్పటికీ రక్షించదన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్​వీ రమణ. అధికారులు, పోలీసులపై దాఖలైన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు ఆయ‌న తెలిపారు. అధికారులు, పోలీస్‌ వ్యవస్థ పనితీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్​వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ అండతో చెలరేగే పోలీసులను న్యాయవ్యవస్థ ఎప్పటికీ రక్షించదని స్పష్టం చేశారు. వసూళ్లకు పాల్పడే అధికారులు మూల్యం చెల్లించుకోవాల్సిందేనని, అధికారులు కోర్టులను ఆశ్రయించడం అలవాటుగా మారిందన్నారు. 
 
ఛత్తీస్‌గఢ్‌ మాజీ ఏడీజీ కేసు విచారణ సందర్భంగా సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారులు, పోలీసులపై దాఖలైన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉందని జస్టిస్​ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం సీజేల నేతృత్వంలో స్థాయీ సంఘం ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. ప్రస్తుతానికి స్థాయీ సంఘంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం లేదని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments