Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఉధృతం.. 199మందికి పాజిటివ్

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (15:21 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. కరోనా నియంత్రణకై ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కేసుల ఉధృతి మాత్రం తగ్గట్లేదు. జూన్ ఫస్ట్ నుంచి కేసుల సంఖ్య పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఏపీలో కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త కేసులతో కలిపితే రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,718కు చేరుకుంది. ఆదివారం మొత్తం 17,695 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
ఇదిలా ఉంటే.. కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీకి చెందిన వారు 130 మందికి.. ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన 69మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. కాగా కొత్తగా ఇద్దరు కరోనా మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు ఒకరు మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు కరోనాతో 75మంది మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 
 
గడిచిన 24 గంటల్లో 17,695 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 199 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారింపబడ్డారు. వారిలో 130 మంది ఏపీకి చెందినవారు కాగా, 69 మంది ఇతర ప్రదేశాల నుంచి వచ్చినవారు. 30 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments