Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయంలో కరోనా కలకలం.. 24 గంటల్లో ఏపీలో 70 కేసులు

Webdunia
శనివారం, 30 మే 2020 (14:25 IST)
ఆంధ్రప్రదేశ్‌ సచివాలయంలో కరోనా కేసు నమోదైంది. ఇప్పటికే ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2874కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 60మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

792మంది వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అలాగే 2092 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో 406మందికి, విదేశాల నుంచి ఏపీకి వచ్చిన 111మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
 
ఈ నేపథ్యంలో అమరావతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సచివాలయంలో కరోనా కలకలం సృష్టించింది. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు.. గత రెండు రోజులుగా అతనితో కలిసి తిరిగినవారు, సికింద్రాబాద్‌ నుండి బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నారని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments