Publish Date: Fri, 29 May 2020 (22:24 IST)
Updated Date: Fri, 29 May 2020 (22:25 IST)
శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లాలోని వంగర మండలంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, సీతంపేట మండలంలో ఒకరు చనిపోయారు. వంగర మండలంలోని మరణించిన వారిలో అచ్యుతరావు అనే పదో తరగతి విద్యార్థి కూడా ఉన్నారు.
నిజానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు జిల్లాలో సూర్యతాపం తారాస్థాయిలోవున్నది. భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. అయితే, సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఫలితంగా ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో పిడుగులు పడడంతో నలుగురు మరణించారు.
మృతుల్లో అచ్యుతరావు అనే పదో తరగతి విద్యార్థి, మరో ముగ్గురు పశువుల కాపరులు ఉన్నారు. వీరంతా పశువులు మేపడానికి వెళ్లి పిడుగుపాటుకు గురయ్యారు. పైగా, మృతులంతా నిరుపేదలని ప్రభుత్వమే వీరిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.