Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా ప్రభావం.. రొయ్యలంటేనే జడుసుకుంటున్న జనం

Webdunia
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (11:14 IST)
కరోనా వైరస్ ప్రభావంతో చైనా ఆహార పదార్థాలను దిగుమతి చేసుకునేందుకు ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. ఫలితంగా చైనా ఎగుమతి పడిపోయింది. ప్రస్తుతం రొయ్యల విషయంలోనూ అదే జరుగుతోంది. పెద్ద పెద్ద రొయ్యల్ని చైనా, జపాన్‌కి వ్యాపారులు ఎగుమతి చేస్తుంది. కానీ ప్రస్తుతం చైనాలో కరోనా వైరస్ ప్రభావం కారణంగా రొయ్యలు ఎగుమతి కావట్లేదు. ఏపీలో రొయ్యల రైతులు... వారం నుంచీ రొయ్యల రేట్లను తగ్గిస్తున్నారు. 
 
ధరలు రోజురోజుకూ తగ్గించేయాల్సి వస్తుండటంపై వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రొయ్యల మేత రేటు నానాటికీ పెరిగిపోతున్న నేపథ్యంలో.. కొత్తగా రొయ్యల మేత తయారీకి వాడే పదార్థాలు చైనా నుంచి దిగుమతి కావట్లేదు. అందుకే రొయ్యల మేత అమ్మే వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అన్ని రకాల రొయ్యల ధరలూ రూ.30 దాకా తగ్గాయి. కరోనా ఎఫెక్ట్ తగ్గేవరకూ రొయ్యలు వద్దంటున్నాయి. 
 
దానికి తోడు కరోనా వైరస్ రాకుండా ఉండాలంటే... మాంసాహారాలు, కోళ్లూ తినవద్దని డాక్టర్లు చెబుతుంటే... ప్రజలు మరింత టెన్షన్ పడుతూ... రొయ్యలు కొనడం తగ్గించేస్తున్నారు. అందువల్ల రొయ్యల రైతులు అన్ని విధాలా నష్టపోతున్నారు. చైనా ప్రభావంతో ఇతర దేశాలకు చెందిన ప్రజలు మాంసాహారం తినాలంటే జడుసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments