Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ.. 332 సెంటర్లు సిద్ధం

Webdunia
బుధవారం, 13 జనవరి 2021 (07:45 IST)
ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 332 సైట్లను ఏర్పాటు చేశారు. మంగళవారమే సీరం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా నుంచి విజయవాడకు వ్యాక్సిన్‌ చేరింది. ఇందులో రాష్ట్రానికి 4 లక్షల 77వేల వ్యాక్సిన్ డోసులు వచ్చాయి. అక్కడి నుంచి పటిష్ట భద్రత మధ్య జిల్లాలకు తరలిస్తున్నారు. ఈ నెల 16న వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ సమీక్ష జరిపారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 
 
కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు, దిశానిర్దేశం చేశారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం వ్యవహరించాలని అధికారులకు సీఎస్ సూచించారు. టీకా పంపిణీకి రాష్ట్రవ్యాప్తంగా 332 సైట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. గర్భిణులు, 18 ఏళ్లలోపు, 50 ఏళ్లు పైబడిన, జబ్బులతో ఇబ్బందిపడేవారికి వ్యాక్సిన్ వేయడం లేదని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments