Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వాణీ మోహన్‌పై వేటు : నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొరఢా

వాణీ మోహన్‌పై వేటు : నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొరఢా
, మంగళవారం, 12 జనవరి 2021 (16:04 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తన అధికారాలను ఉపయోగిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలను బేఖాతరు చేస్తున్న అధికారులపై వరుసగా క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జేడీ సాయి ప్రసాద్‌ను విధుల నుంచి తొలగించారు. 
 
తాజాగా సెక్రటరీగా ఉన్న వాణీ మోహన్‌ను తొలగిస్తూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. వాణీమోహన్‌ సేవలు ఎన్నికల కమిషన్‌లో అవసరం లేదని లేఖలో తెలిపారు. వాణీమోహన్‌ను రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 
 
కాగా, ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍పై సోమవారం క్రమశిక్షణ చర్యలు చర్యలు తీసుకున్న విషయం తెల్సిందే. 30 రోజులపాటు సెలవుపై వెళ్లిన సాయిప్రసాద్‌.. ఇతర ఉద్యోగులను సైతం సెలవుపై వెళ్లేలా ప్రభావితం చేశారని అభియోగాలు ఉన్నాయి. 
 
దీన్ని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించిన ఎన్నికల కమిషన్.. ప్రస్తుత ఎన్నికలకు విఘాతం కలిగించేలా చర్యలున్నాయంటూ సాయి ప్రసాద్‌ను విధుల నుంచి తొలగించింది. ఇతర ప్రభుత్వ సర్వీసులలో ప్రత్యక్షంగా లేదా.. పరోక్షంగా విధులు నిర్వహించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
 
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర హైకోర్టు ఏక సభ్య ధర్మాసనం నిలిపివేసింది. ప్రజారోజ్యం దృష్ట్యా ఈ షెడ్యూలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
అయితే, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని ఎస్ఈసీ తరపు న్యాయవాది తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వరుసగా సెలవులు ఉన్నందున, అత్యవసర పిటిషన్‌గా భావించి విచారణ జరపాలని డివిజన్ బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు.
 
అంతకుముందు, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సింగిల్ బెంచ్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను సస్పెండ్ చేసింది. ఎన్నికల షెడ్యూల్ పై ఎస్ఈసీ నిర్ణయం సరికాదని పేర్కొంది.
 
ఏపీ సర్కారుకు ఊరట.. 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసింది. ఈ ఆదేశాలు ఏపీ సర్కారుకు ఊరట కలిగించేలా ఉన్నాయి. కరోనా వ్యాక్సిన్‌కు అంతరాయం కలగరాదనీ, ప్రజాసంక్షేమం దృష్ట్యా వీటిని నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. 
 
ఇటీవల ఎస్ఈసీ విడుదల చేసిన ఎన్నికల షెడ్యూల్ ను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై సోమవారం కోర్టులో విచారణ జరిగింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు స్థానిక ఎన్నికలు అడ్డొస్తాయని హైకోర్టు భావించింది. ప్రజారోగ్యం దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్ నిలిపివేశామని న్యాయస్థానం స్పష్టం చేసింది.
 
విచారణ సందర్భంగా ఎస్ఈసీ నిర్ణయాలను న్యాయస్థానం తప్పుబట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌పై ఎస్ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదని అభిప్రాయపడింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, స్థానిక ఎన్నికలు ఒకే సమయంలో నిర్వహించడం కష్టసాధ్యమని కోర్టు వ్యాఖ్యానించింది. 
 
ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపున ఏజీ రెండు గంటల పాటు వాదనలు వినిపించారు. కాగా, హైకోర్టు తీర్పుపై డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించాలని ఎస్ఈసీ నిర్ణయించినట్టు సమాచారం. ఏపీలో పంచాయతీ ఎన్నికల కోసం ఈ నెల 8న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేలా షెడ్యూల్ రిలీజ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకులో భర్తను చితక్కొట్టిన భార్య.. ఎందుకు?