Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్థానిక పోరుపై ఎస్ఈసీకి సహకరించాల్సిందే... : ఏపీ సర్కారుకు హైకోర్టు ఆదేశం

Advertiesment
AP High Court
, బుధవారం, 23 డిశెంబరు 2020 (15:25 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మరోమారు షాకిచ్చింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించే అధికారం పూర్తి అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. పైగా, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించాలని, ప్రభుత్వ అధికారులు వెళ్లి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సమావేశం కావాలని హైకోర్టు సూచన చేసింది. 
 
గత మార్చి నెలలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల కరోనా మహమ్మారి కారణంగా వాయిదాపడిన విషయం తెల్సిందే. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయి. పైగా, బీహార్ వంటి శాసనసభకు ఎన్నికలు జరుగగా, జీహెచ్ఎంసీకి కూడా ఎన్నికలు జరిగాయి. 
 
ఈ క్రమంలో వచ్చే యేడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. కానీ, ఏపీ ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. ఫలితంగా స్థానిక పోరు పంచాయతీ హైకోర్టుకు చేరింది. 
 
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనుకూలంగా ఆదేశాలు వెలువరించింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్న ఎస్ఈసీకి సహరించాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ప్రభుత్వ అధికారులు కలవాలంటూ స్పష్టం చేసింది. 
 
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు జరపవచ్చో, లేదో నిర్ణయించుకునే పూర్తి అధికారం ఎస్ఈసీకి ఉందని ధర్మాసనం వెల్లడించింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని ఏపీ సర్కారు అంగీకరించడంలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా స్ట్రెయిన్ : కర్నాటకలో నైట్ కర్ఫ్యూ - మహారాష్ట్రలో కూడా...