ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈయన ఇప్పటివరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు.
ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్ని పదవీ పొడగింపు కాలం ఈనెల 31వ తేదీతో ముగియనుంది. దీంతో అదే రోజున ఆదిత్యనాథ్ దాస్ సీఎస్‌గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఇక తెలంగాణ నుంచి వచ్చిన శ్రీలక్ష్మికి ఏపీ సర్కార్ మున్సిపల్ శాఖ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించింది. అలాగే ఏపీ సాంఘీక సంక్షేమ శాఖ కార్యదర్శిగా కె. సునీత నియామకం అయ్యారు.
ఇక సీఎస్‌గా పదవీ విరమణ పొందనున్న నీలం సాహ్నీని ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
వాస్తవానికి నీలం సాహ్ని పదవీకాలం ఎపుడో ముగిసినప్పటికీ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆమె పదవీ కాలాన్ని పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, కేంద్రం కూడా ఆమోదముద్ర వేసింది.