ఏపీలో 2,982 కరోనా కేసులు.. 27 మరణాలు

Webdunia
గురువారం, 8 జులై 2021 (19:45 IST)
రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 91,070 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి వ్యాధి సోకినట్లు తేలింది. 27 మంది మరణించారు. మరో 3,461 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా రోగుల సంఖ్య 19,14,213కు చేరింది. వీరిలో ఇప్పటికే 18,69,417 మంది కోలుకున్నారు.

ఇంకా 31,850 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 616, చిత్తూరులో 401 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 32, విజయనగరంలో 50 కేసులు నమోదయ్యాయి.

కరోనా లక్షణాలతో ప్రకాశం జిల్లాలో ఆరుగురు, కృష్ణాలో ఐదుగురు, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో నలుగురేసి, అనంతపురంలో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 12,946కు చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

నేను కంటి నిండా నిద్రపోయి చాలా నెలలైంది.. మీరు అలాచేయకండి.. రష్మిక

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments