Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ.. ఏపీలో 1398, తెలంగాణలో 1078 కేసులు

Webdunia
శనివారం, 3 ఏప్రియల్ 2021 (19:08 IST)
ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 1398 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 9లక్షల 5వేల 946కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారిన పడి 9 మంది మృత్యువాత పడడంతో ఏపీలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 7 వేల 234 కు పెరిగింది. రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8లక్షల 89వేల 295గా ఉండగా ప్రస్తుతం 9వేల 417 మంది బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
 
మరోవైపు కరోనా నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని కరోనా క్వారంటైన్ సెంటర్లను తిరిగి ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హైదరాబాద్ లోని నేచర్ క్యూర్ ఆసుపత్రి, క్వారంటైన్ సెంటర్‌ను సందర్శించిన హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు.
 
ఇక తెలంగాణలో తాజాగా ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1078 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,10,819కి చేరింది. ఇందులో 3,02,207 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 6,900 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments