Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంజ్ స‌ర్కిల్‌ని కాకాని సర్కిల్‌గా మార్చండి: క‌లెక్ట‌ర్ ఢిల్లీరావుకు కాకాని ఆశ‌య సాధ‌న స‌మితి విన‌తి

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (16:09 IST)
బెంజ్ స‌ర్కిల్లో కాకాని వెంక‌ట‌ర‌త్నం విగ్ర‌హాన్ని పున‌రుద్ధ‌రించాల‌ని కాకాని ఆశ‌య సాధ‌న స‌మితి డిమాండు చేసింది. కొత్త‌గా ఏర్పాట‌యిన ఎన్.టి.ఆర్. జిల్లాకు మ‌కుటాయ‌మానంగా నిలిచే ఆంధ్ర ఉక్కు మ‌నిషి, మాజీ మంత్రి కాకాని వెంక‌ట‌ర‌త్నం విగ్ర‌హాన్ని విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేయాల‌ని కాకాని ఆశ‌య సాధ‌న స‌మితి అధ్య‌క్షుడు త‌రుణ్ కాకాని కోరారు.

 
జిల్లా క‌లెక్ట‌ర్ ఢిల్లీ రావును క‌లెక్ట‌రేట్లో క‌లిసి ఈ మేర‌కు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. జై ఆంధ్ర ఉద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించి, ఆంధ్ర ఉక్కు మ‌నిషిగా పేరుగాంచిన కాకాని విగ్ర‌హాన్ని గతంలో బెంజ్ సర్కిల్ వ‌ద్ద తొలిగించారు. ఆ స‌మ‌యంలోనే కాకాని ఆశ‌య స‌మితి ప్ర‌తినిధులు నిర‌స‌న తెలిపారు. కానీ అప్ప‌ట్లో ప్ర‌భుత్వం స్పందించ‌లేదు. ఇపుడు తాజాగా ఎన్.టి.ఆర్. జిల్లా ఏర్ప‌డిన సంద‌ర్భంగా, వై.ఎస్. జ‌గ‌న్ ప్ర‌భుత్వం బెంజ్ స‌ర్కిల్ వ‌ద్ద కాకాని వెంట‌ర‌త్నం విగ్ర‌హాన్ని పున‌రుద్ధ‌రించాల‌ని డిమాండు చేశారు.

 
బెంజ్ స‌ర్కిల్‌ని కాకాని స‌ర్కిల్‌గా నామ‌క‌ర‌ణం చేయాల‌ని త‌రుణ్ కాకాని డిమాండు చేశారు. బెంజ్ స‌ర్కిల్ వ‌ద్ద కాకాని వెంక‌ట‌ర‌త్నం విగ్రం పున‌రుద్ద‌ర‌ణ‌కు అవ‌స‌ర‌మ‌య్యే ఖ‌ర్చును కాకాని ఆశ‌య సాధ‌న స‌మితి భ‌రిస్తుంద‌ని త‌రుణ్ కాకాని జిల్లా క‌లెక్ట‌ర్ ఢిల్లీ రావుకు వివ‌రించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments