Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతికి పలుమార్లు గర్భస్రావం.. పెళ్లి మాటెత్తితే నో అన్న కాంగ్రెస్ నేత?

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (11:25 IST)
పుదుచ్చేరిలో కాంగ్రెస్‌కు చెందిన సామాజిక ప్రసార మాధ్యమాల సమన్వయకర్త.. ప్రేమ పేరుతో డ్రామా ఆడాడు. ప్రేమ పేరిట ఓ యువతిని నమ్మబలికి చివరికి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. విల్లియనూర్ శివరానందం పేటకు చెందిన తమిళరసన్ (27) కాంగ్రెస్ పార్టీకి చెందిన సామాజిక ప్రసార మాధ్యమాల సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతడు అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు. ఓ రోజు తమిళరసన్ ఆ యువతిని ఒంటరిగా రమ్మన్నాడు.

ఆమె కూడా ప్రేమికుడే కదాని అతనితో వెళ్లింది. ఆపై నిర్మానుష్య ప్రదేశంలో ఆమెను లోబరుచుకున్న తమిళరసన్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ యువతి గర్భం దాల్చింది. 
 
ఈ విషయం బహిర్గతం అయితే అవమానం తప్పదని..తమిళరసన్ ఆ యువతికి గర్భస్రావం చేయించాడు. ఆపై కొద్దిరోజులకే మాయమాటలు చెప్పి ఆమెపై పలు మార్లు అత్యాచారినికి పాల్పడ్డాడు. కానీ అత్యాచారానికి పాల్పడటం గర్భం ధరిస్తే.. గర్భస్రావం చేయించడం.. పెళ్లి మాటెత్తితే మాయ మాటలు చెప్పి తప్పించుకోవడం చూసిన ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమిళరసన్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి ఇలాంటి నీచమైన పనికి ఒడిగట్టడం.. స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments