వైకాపాపై నిప్పులు చెరిగిన పృథ్వీ .. జగన్ పిలిచి వైసీపీలోకి రమ్మంటే..?

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (16:34 IST)
టాలీవుడ్‌ సీనియర్ కమెడియన్‌గా, థర్టీ ఇయర్స్ పృథ్వీ‌గా పృథ్వికి మంచి పేరుంది. 'ఖడ్గం' సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగుతో ఫేమసైన ఆయన.. ఆ తర్వాత 30 ఇయర్స్ పృథ్వీగా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు.
 
వైసీసీలో చేరి ఆ పార్టీ తరుపున ప్రచారం చేసి 2014 ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న కమెడియన్ పృథ్వీ ఇప్పుడు అదే పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
జనసేన, పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు చేస్తూ సంచలనం సృష్టించిన ఆయన తిరిగి యూ టర్న్ తీసుకోవడం హాట్ టాపిక్ అయింది.
 
వైకాపా నేత అయిన పృథ్వీకి వైయస్ జగన్.. పృథ్వీకి ప్రతిష్ఠాత్మకమైన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌కు ఏకంగా చైర్మన్ చేసేసారు.
 
ఈ క్రమంలో పృథ్వీపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంలో ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. అప్పట్లో పృథ్వికి సంబంధించిన ఓ ఆడియో కాల్ సెన్సేషన్ అయింది. అయితే ఈ విషయంలో తనపై కుట్ర జరిగిందంటూ ఆయన పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.
  
తాజాగా వైకాపా నిప్పులు చెరిగారు పృథ్వీ రాజ్. మళ్లీ జగన్ పిలిచి వైసీపీలోకి రమ్మంటే వెళతారా? అని పృథ్విని అడగడంతో వెంటనే ఓపెన్ అవుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
 
మళ్ళీ వైసీపీకి వెళ్తారా అంటే.. చాలండి.. నమస్కారమండి అని అంటాను. వెళ్లే వాళ్లకైనా సిగ్గు, శరం ఉండాలి. నేనెప్పుడూ నా కులం గురించి మాట్లాడలేదు. ఫస్ట్ టైమ్ చెబుతున్నా. తూర్పు గోదావరి జిల్లా చోళ్లంగిలో పుట్టిన కాపు బిడ్డగా చెబుతున్నా. అలాంటి పనులు మా జాతిలో ఎవడూ చేయడు అనేశారు పృథ్వి. మళ్లీ వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదన్నట్లుగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi Vs Jani Master: జానీ మాస్టర్, ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్‌‌లపై విమర్శలు.. కర్మ వదిలిపెట్టదు..

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం