వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోని తెలుగు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. గత కొన్ని నెలలుగా సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉండటం, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో రాజకీ
వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలోని తెలుగు సినీ ప్రముఖులు క్యూ కడుతున్నారు. గత కొన్ని నెలలుగా సర్వేలన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ఉండటం, రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న సినీ ప్రముఖలందరూ వైసిపి వైపు దృష్టి పెడుతున్నారు.
నిన్నటికి నిన్న పోసాని క్రిష్ణమురళి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వెళ్ళి ఆయనతో పాటు కలిసి నడిచారు. నేడు కమెడియన్ ఫృధ్వీ కూడా జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఐదు నిమిషాల పాటు పాదయాత్రలోనే జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడుతూ వచ్చారు ఫృధ్వీ. ఇప్పటికే తనకు రాజకీయాలంటే ఇష్టమని, వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు ఫృథ్వీ రాజ్ చెప్పారు.
అనుకున్న విధంగానే అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతను ఫృథ్వీ కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఫృథ్వీ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారుతోంది.