Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోదావరి జిల్లాల్లో కోడిపందేల సందడి .. బరిలో పాకిస్థాన్ కోళ్లు

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అంటే కోడిపందేలే. ఈ పందేలు లేకుండా సంక్రాంతి అంటే అతి ఉప్పుకారం లేని పప్పులాంటిదే. అలాంటి పందేలు ఈ యేడాది చిన్నపాటి ఆంక్షల మధ్య నిర్వ

Webdunia
శుక్రవారం, 5 జనవరి 2018 (12:34 IST)
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ అంటే కోడిపందేలే. ఈ పందేలు లేకుండా సంక్రాంతి అంటే అతి ఉప్పుకారం లేని పప్పులాంటిదే. అలాంటి పందేలు ఈ యేడాది చిన్నపాటి ఆంక్షల మధ్య నిర్వహించనున్నారు. ఈ పందేలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఇప్పటినుంచే అమితోత్సాహాన్ని చూపుతున్నారు. ఈ పందేల సందర్భంగా కోట్లాది రూపాయలు చేతులు మారనున్నాయి. 
 
ఇందులోభాగంగా, ఇప్పటికే కోనసీమలో సంక్రాంతి సంబరాలతో పాటు కోడిపందేల సందడి మొదలైంది. అయితే, ఈసారి జరిగే కోడి పందేలకు ఓ ప్రత్యేకత ఉంది. గోదావరి జిల్లాల కోళ్లతో తలపడేందుకు పాకిస్థాన్ కోళ్లు సై అంటున్నాయి. కోనసీమ పందెం కోళ్ల పెంపకందారులు శత్రుదేశపు కోళ్ల బ్రీడ్‌ను ఇక్కడికి తెప్పించుకుని పెంచుతున్నారు. పాక్ కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. కేవలం పాక్ దేశపు కోళ్లనేకాకుండా తైవాన్, ఇండోనేషియా, మలేషియా దేశాల నుంచి ఆయా బ్రీడ్స్ కోళ్లను తెప్పించి పెంచుతున్నారని సమాచారం. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టకుండా వేసే పందేల్లో పాక్ బ్రీడ్ కోళ్లు బాగా ఉపయోగపడతాయని నిర్వాహకులు చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments