Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సంక్రాంతికి 'కత్తి' కట్టని కోడి పందేలు... సుప్రీం తీర్పుతో నిర్వాహకుల్లో హుషారు

ఈ సంక్రాంతి పండుగకు కోడిపందేలు నిర్వహణ గతంకంటే కాస్త విభిన్నంగా సాగనుంది. కోడిపందేల్లో ఉపయోగించే ఆయుధాలను స్వాధీనం చేసుకుని.. కోళ్ళను వదిలిపెట్టాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ఇది కోడిపందేల నిర్వాహకుల్లో హుషారురేకెత్తించింది. దీంతో సంక్

సంక్రాంతికి 'కత్తి' కట్టని కోడి పందేలు... సుప్రీం తీర్పుతో నిర్వాహకుల్లో హుషారు
, మంగళవారం, 10 జనవరి 2017 (06:27 IST)
ఈ సంక్రాంతి పండుగకు కోడిపందేలు నిర్వహణ గతంకంటే కాస్త విభిన్నంగా సాగనుంది. కోడిపందేల్లో ఉపయోగించే ఆయుధాలను స్వాధీనం చేసుకుని.. కోళ్ళను వదిలిపెట్టాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీచేసింది. ఇది కోడిపందేల నిర్వాహకుల్లో హుషారురేకెత్తించింది. దీంతో సంక్రాంతి సందడిని పెంచుతూ.. కోడి పందేల నిర్వహణకు వారు సిద్ధమవుతున్నారు. 
 
పందేలు నిర్వహించుకోవచ్చునని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పకపోయినా, ఇప్పటికీ నిషేధమే కొనసాగుతున్నా, కత్తులు కట్టకుండా ఆడేందుకు సిద్ధమయిపోతున్నారు. అంతేకాదు, పండగ నాటికి మిగతా అడ్డంకులూ తొలగిపోయి.. ఎప్పటిలాగే కోళ్లు బరులు కళకళలాడతాయనిన్న ఆశాభావంతో వారు ఉన్నారు.
 
ఈ నేపథ్యంలో గోదవారి ప్రాంతాలైన భీమవరం, ఉండిల పరిధిలో ఇప్పటికే కొత్త, పాత బరులను గుర్తించారు. పండగ మరో 4 రోజులు మాత్రమే ఉండటంతో పందెంరాయుళ్ల హడావుడి, వేర్వేరు ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి తరలివస్తున్న వారి సందడితో గోదావరి జిల్లాలు వింత కళని సంతరించుకొన్నాయి. గతేడాది జిల్లాలో చిన్నా, పెద్ద కలిపి 250 బరుల్లో ఆడారు. అధికార, ప్రతిపక్ష పార్టీల బరులువేరుగా ఉన్నాయి. 
 
ఈ ఏడాది కొత్తగా కులం, వర్గం ప్రాతిపదికన పందేలు నిర్వహించనున్నారని సమాచారం. భీమవరం రూరల్‌, వీరవాసరం, ఉండి, పెనుమంట్ర, పాలకొల్లు, మొగల్తూరు, నర్సాపురం, గణపవరం, నిడమర్రు, అత్తిలి మండలలలో బరుల ఎంపిక పూర్తయ్యింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒక్క రోజులో ఇన్ని నియామకాలా.. చెల్లవు గాక చెల్లవన్న సుప్రీం కోర్టు