నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఆంధ్రప్రదేశ్

Webdunia
ఆదివారం, 5 జూన్ 2022 (18:02 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తుంది. సూర్యతాపం కారణంగా పగటి పూటేకాకుండా రాత్రి సమయాల్లో కూడా వేడి వాతావరణం కొనసాగుతుంది. దీంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు తల్లడిల్లిపోతున్నారు. 
 
అదేసమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసినప్పటికీ ఎండ, ఉక్కపోత మాత్రం తగ్గడం లేదు. దీనికితోడు గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉందని, ఇదే పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగవచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
మరోవైపు, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిన వివరాల మేరకు రాష్ట్రంలోని 433 మండలాల్లో వేడి వాతావరణం నెలకొంది. 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచాయి. అనేక ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 44 నుంచి 46 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. 
 
రానున్న రెండు రోజులు కోస్తాలో వడకాల్పులు, తీవ్ర వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. ఈ నెల 11వ తేదీ వరకు కోస్తాలో ఎండలు కొనసాగుతాయని వాతావణ శాఖ తెలిపింది. అయితే, వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments