Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురి యువకుల ప్రాణాలు తీసిన బొగ్గులకుంపటి

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (09:36 IST)
మేడ్చల్ జిల్లాలో ఓ బొగ్గుల కుంపటి నలుగురి ప్రాణాలు తీసింది. వెచ్చదనం కోసం వెలిగించిన ఈ కుంపటి కారణంగా చివరకు నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పాలమూరు జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నలుగురు యువకులు మేడ్చల్ జిల్లా షామీర్ పేట్ మండలం బొమ్రాస్‌పేట గ్రామశివారులో ఉన్న ఓ కోళ్ళఫారంలో పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నలుగురు యువకులు అనుమానాస్పదంగా మృతి చెందారు. 
 
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ చేపట్టారు. యువకులు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ఎవరైనా హత్య చేశారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 
 
ఈ విచారణలో బొగ్గుల కుంపటి వల్లే నలుగురు చనిపోయినట్లు పోలీసులు తేల్చారు. రాత్రి కోళ్లకు టీకాలు వేసిన తర్వాత నలుగురు యువకులు మద్యం సేవించారు. గదిలోకి వెళ్లిన తర్వాత వెచ్చదనం కోసం బొగ్గుల కుంపటిని వెలిగించారు. తలుపులు, కిటికీలు మూసివేయడం వల్ల ఊపిరాడక చనిపోయారంటూ పోలీసులు ప్రాథమిక నిర్ధారణ చేశారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments