ఎమ్మెల్యేలకు సీఎం జగన్ వార్నింగ్ - తీరు మార్చుకోకుంటే కొత్తవారికి ఛాన్స్...

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2022 (17:38 IST)
వైకాపాకు చెందిన శాసనసభ్యులకు శుక్రవారం వర్క్ షాపు నిర్వహించారు. తాడేపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వర్క్ షాపుకు ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సారథ్యం వహించారు. ఇందులో ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఇందులో 32 మంది ఎమ్మెల్యేలకు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. పనితీరును మెరుగు పరుచుకోవాలని, లేకపోతే వచ్చే ఎన్నికల్లో వేటు తప్పదంటూ హెచ్చరించారు. 
 
ముఖ్యంగా వచ్చే 100 రోజులు ప్రతి ఒక్క ఎమ్మెల్యేతో పాటు పార్టీకి ఎంతో ముఖ్యమైనవని, పని తీరును మార్చుకోని పక్షంలో వచ్చే ఎన్నికల్లో వారికి టిక్కెట్లు ఇవ్వబోనని తేల్చి చెప్పారు. పైగా, కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతానని చెప్పారు. నిజానికి వచ్చే ఎన్నికల్లో ఎవరినీ మార్చే ఉద్దేశ్యం తనకు లేదనీ, కానీ ఆ పరిస్థితిని మీరే తెచ్చుకోవద్దని కోరారు.
 
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కనీసం 10 రోజుల పాటు ప్రతి ఒక్క ఎమ్మెల్యే పాల్గొనాలని కోరారు. అయినప్పటికీ కొందరు దాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో పది రోజుల కంటే తక్కువగా పాల్గొన్న వారు 32 మంది వరకు ఉన్నారని ఐప్యాక్ సంస్థకు చెందిన రిషి తమ నివేదిక ద్వారా వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గౌతమి చౌదరి వర్సెస్ ధర్మ మహేష్.. భార్యపై కేసు పెట్టాడు.. కారణం ఏంటంటే?

Sudheer Babu: ఇండస్ట్రీ బ్యాగ్రౌండ్ లేనివారికి కష్టం, అందుకే అలా మాట్లాడా : హీరో సుధీర్ బాబు

Chinmayi: సజ్జనార్‌కు ఫిర్యాదు చేసిన చిన్మయి శ్రీపాద

Bandla Ganesh: బండ్ల గణేష్ పై ఇండస్ట్రీ సీరియస్ - గబ్బర్ సింగ్ లాంటి సినిమా తీయలేనా?

Manoj: ఎవరినీ మోసం చేయను, మౌనిక ను బాగా చూసుకుంటా : మంచు మనోజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments