Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నవరం మహిళ సమస్యను పరిష్కారానికి సీఎం ఆదేశం

Webdunia
శనివారం, 5 నవంబరు 2022 (10:05 IST)
కాకినాడ జిల్లా అన్నవరానికి చెందిన ఆరుద్ర అనే మహిళ సమస్య పరిష్కారనికి అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఇటీవల సీఎం క్యాంపు కార్యాలయం వద్ద అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమార్తెను వీల్‌చైర్‌తో సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి సీఎంను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, ఆమెను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో తన వెంట తెచ్చుకున్న బ్లేడుతో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మీడియాలో వైరల్ అయింది. 
 
దీంతో సీఎం స్పందించారు. ఆమె సమస్యలు పరిష్కారించాలంటూ అధికారులను ఆదేశించారు. అధికారులకు ఆమెకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో కదిలిన అధికారులు ఆరుద్రను ప్రత్యేక అంబులెన్స్‌లో తాడేపల్లి క్యాంపు క్యాలయం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ఆమెతో సీఎం ముఖ్య కార్యదర్శి ధనంజయ రెడ్డి మాట్లాడి, సమస్యను అడిగి తెలుసుకున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, తమ సమస్యల పట్ల స్పందించడమే కాకుండా హామీ ఇచ్చిన సీఎంకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తన కుమార్తెకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారని, తన ఇంటిని అమ్ముకునేందుకు అడ్డుపడుతున్న పోలీస్ కానిస్టేబుళ్ళపై చర్యలు తీసుకుంటామని కూడా భరోసా ఇచ్చారని తెలిపారు. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments