Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా : సీఎం జగన్

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (15:05 IST)
ఏపీ జెన్‌కో థర్మల్ ప్లాంట్ నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు పర్యటనకు వచ్చారు. ఇక్కడ నిర్మించిన ఏపీ జెన్‌కో మూడో ప్లాంట్‌ను ప్రారంభించి ప్రైవేటుకు అంకితం చేశారు. 
 
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి రంగంలో మరో ముందడుగు పడిందన్నారు. అత్యాధునిక సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో ఏపీ జెన్ కో స్వయంగా నిర్మించిన దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 800 మెగావాట్ల‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. 
 
నాడు 2008లో ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారని, రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా సేవలు అందించిన దామోదరం సంజీవయ్య పేరును ఈ థర్మల్ స్టేషన్‌కు పెట్టుకున్నామని ఆయన తెలిపారు. 
 
ముఖ్యంగా దేశంలో ప్రభుత్వ రంగంలో సూపర్ టెక్నాలజీతో నిర్మితమైన తొలి థర్మల్ విద్యుత్ కేంద్రం ఇదేనని చెప్పారు. ఈ థర్మల్ ప్లాంట్‌ కోసం కృష్ణపట్నం పోర్టు కోసం భూములిచ్చిన రైతులకు నిండు మనస్సుతో శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు మంత్రులు, జిల్లా వైకాపానేతలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా ప్రభాస్.... ఎలా?

కల్కి 2898 AD ప్రపంచవ్యాప్తంగా 4 రోజుల్లో 555 Cr+ వసూళ్లు

భారతీయుడు2 లో క్యాలెండర్ సాంగ్ చేస్తున్న మోడల్ డెమి-లీ టెబో

కల్కి మొదటి వారాంతం హిందీ, ఉత్తర అమెరికా కలెక్టన్ల వివరాలు

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments