Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగయ్య మృతి కేసు - జగన్ అరెస్టు తప్పదా? హైకోర్టులో క్వాష్ పిటిషన్

ఠాగూర్
బుధవారం, 25 జూన్ 2025 (15:16 IST)
పల్నాడు జిల్లాలో చిలీ సింగయ్య అనే వృద్ధుడి మృతి కేసులో వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్టయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల జగన్ పల్నాడు జిల్లా రెంట్లపాడులో పర్యటించారు. ఆ సమంయలో ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు చక్రం కింద పడి సింగయ్య మృత్యువాతపడ్డాడు. ఈ మృతికి సంబంధించి జగన్ కారు డ్రైవర్‌ను మొదటి నిందితుడుగాను, రెండో నిందితుగా జగన్మోహన్ రెడ్డి పేరు, పీఏ నాగేశ్వర్ రెడ్డి, వైకాపా నేతలు వైవీ సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడదల రజనీలను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే జగన్ ప్రయాణించిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో జగన్‌తో పాటు మిగిలిన వారంతా హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ చేపడుతామని హైకోర్టు తెలిపింది. జగన్ వాహనం కింద సింగయ్య పడినట్టు వీడియోలో ఉందని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించిన విషయం తెల్సిందే. సీసీటీవీ ఫుటేజీ, డ్రోన్ దృశ్యాలు, ఘటనా స్థలంలో ఉన్నవారు తీసిన వీడియోలు పరిశీలించినట్టు ఆయన తెలిపారు. ఆ తర్వాత కేసు నమోదు చేశామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments