Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే ఏపీలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (11:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విస్తరణకు శరవేగంగా చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా, పలువురు రాజకీయ నేతలు సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఆ తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఏపీ రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇందులోభాగంగా, భారీ బహిరంగ సభను నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఈ బహిరంగ సభను విజయవాడ లేదా గుంటూరులలో నిర్వహించే అవకాశం ఉంది. అలాగే, విశాఖపట్టణం, తిరుపతి వంటి నగరాల్లో కూడా సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. 
 
నేడు పలువురు నేతల చేరిక.. 
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ను దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. ఇందులోభాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ శాఖను ఏర్పాటు చేయనున్నారు. ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ను నియమించేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న తర్వాత ఆయన్ను ఏపీ శాఖ అధ్యక్షుడుగా ప్రకటించే అవకాశం ఉంది.
 
మరోవైపు, బీఆర్ఎస్‌లో మరికొంతమంది ఏపీ నేతలు సోమవారం చేరనున్నారు. వీరిలో చంద్రశేఖర్‌తో పాటు ఐఆర్టీఎస్ మాజీ అధికారి  రావెల కిషోర్ బాబు, మాజీ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి, అనంతపురం జిల్లాకు చెందిన టేజీ ప్రకాష్‌తో పాటు పలువురు నేతలు పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో వీరంతా బీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పుకోనున్నారు. 
 
ఆ తర్వాత ఏపీ పగ్గాలను తోట చంద్రశేఖర్‌కు అప్పగించనున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్ర కేడర్‌ ఐఏఎస్‌గా 23 యేళ్లపాటు పని చేసిన ఈయన గత 2009లో పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2014లో వైకాపా అభ్యర్థిగా ఏలూరు లోక్‌సభ నుంచి 2019లో జనసేన నుంచి గుంటూరు పశ్చిమ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి ఓడిపోయారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments