Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేతల బూతులకు ఇది రియాక్షన్ : వైకాపా నేతల దాడులపై సీఎం జగన్

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (13:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా నేతలు, శ్రేణులు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నారు. ఈ విష సంస్కృతి గత రెండున్నరేళ్ళ కాలంలో ఏపీలో హెచ్చుమీరిపోయింది. ముఖ్యంగా, మంగళవారం ఈ సంస్కృతి మరింతగా పెట్రేగిపోయింది. ఈ దాడులు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. 
 
ఈ నేపథ్యంలో వైకాపా శ్రేణులు జరిపిన దాడులపై ఏపీ సీఎం జగన్ బుధవారం స్పందించారు. ప్రభుత్వ పథకాల్ని చూసి ఓర్వలేక బూతులు తిడుతున్నారంటూ కౌంటర్‌ ఇచ్చారు. ఎవరు మాట్లాడని బూతులు ప్రతి పక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు.
 
ఈ బూతులను జీర్ణించుకోలేని నన్ను ప్రేమించే వాళ్లు, అభిమానించే వాళ్లు రియాక్షన్‌ చూపించారని.. దాని ప్రభావం రాష్ట్రంలో కనబడిందని.. కానీ, రెచ్చగొట్టి, వైషమ్యాలను సృష్టించి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తున్నారంటూ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చారు.
 
ఇక, మీ చల్లని దీవెనలతో రెండేళ్లు పాలన అద్భుతంగా సాగిందన్నారు. ఇదేసమయంలో కొంతమంది కావాలని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజలకు ఎలాంటి మేలు జరగకూడదు.. ప్రభుత్వ పథకాలు అమలు కాకూడదు.. అలా జరిగితే ప్రజలకు లబ్ధి చేకూరుతుంది, సీఎం జగన్‌కు మంచి పేరు వస్తుంది.. తమకు మనుగడ ఉండదన్న భయంతోనే.. వాటిని అడ్డుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

రామోజీ ఫిల్మ్ సిటీ అద్భుతం.. 2వేల ఎకరాలు.. 2500 సినిమాలు

వెకేషన్‌లో మెహ్రీన్.. ఓవర్ డోస్ గ్లామర్ షో.. ఫోటోలు వైరల్

ఉషాకిరణ్ సంస్థకు గౌవరం సమాజ కథలను వెలికి తీసిన ఘనత రామోజీరావుదే

చిత్ర సీమలో ఉషోదయ కిరణాలను ప్రసరింప చేశారు : నందమూరి బాలకృష్ణ

జగన్ అరాచకాల మనోవేదనతోనే రామోజీరావు ఆరోగ్యo క్షీణించింది: నిర్మాత నట్టి కుమార్

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments