ముస్లిం సోదరులకు సీఎం జగన్‌ రంజాన్‌ శుభాకాంక్షలు

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (13:41 IST)
అమరావతి: ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు (ఈద్‌ ముబారక్‌) తెలిపారు. అల్లా దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని, కరోనా మహమ్మారి నుంచి బయట పడి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత అని పేర్కొన్నారు.
 
పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో ముస్లిం సోదరసోదరీమణులంతా నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షతో నిష్టగా అల్లాను ఆరాధిస్తూ ఆధ్యాత్మిక జీవనం కొనసాగిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. అల్లా రక్షణ, కరుణ పొందాలనే లక్ష్యంతో రంజాన్‌ మాసంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని, ప్రతి ఒక్కరూ ఉన్నదానిలో ఎంతోకొంత దానధర్మాలు చేస్తారని, సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకొంటారని సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొత్త బిజినెస్ ప్రారంభించిన సమంత.. నటి, నిర్మాత, వ్యాపారవేత్తగా శామ్ అదుర్స్

మైనర్ బాలికతో శృంగారం చేసే మహానుభావులకు థ్రిల్‌గా ఉంటుంది : చిన్మయి

అక్కినేని నాగార్జున ఫ్యామిలీకి సారీ చెప్పిన మంత్రి కొండా సురేఖ

చికిరి చికిరి పాటకు నేపాల్ అమ్మాయి స్టెప్పులు.. అదరగొట్టేసిందిగా.. ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ధర్మేంద్ర... ఇంట్లోనే వైద్య సేవలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments