Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూతన విద్యా విధానంపై సీఎం జగన్ రివ్యూ, పదోతరగతి పరీక్షలో మార్పు లేదు

Webdunia
మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (17:58 IST)
రాష్ట్రంలో నూతన విద్యా విధానంపై సీఎం జగన్ రివ్యూ నిర్వహించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాముఖ్యతను ఇస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం తీసుకొనిరాగా దానిపై సీఎం జగన్ మంగళ వారం సమీక్షించారు.
 
నూతన విద్యావిధానంలో ప్రభుత్వం అమలు పరుస్తున్న చాలా అంశాలు ఉన్నాయని తెలిపారు. ప్రీ ప్రైమరీ క్లాసులు నిర్వహించాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రీ ప్రైమరీ విద్యకు, అంగన్‌వాడీ విద్యకు, స్కూల్ విద్యకు మధ్యలో ఒక ఏడాది అనుసంధానం చేయాలని నిర్ణయించామని మంత్రి అన్నారు.
 
పీపీ1, పీపీ2తో పాటు మరో ఏడాది పెంచుతున్నామని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. ఉన్నత పాఠశాల స్థాయిలో 3,5,8 తరగతుల్లో పరీక్షలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులు సామర్థ్యాన్ని పరీక్షించడానికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే 10వ తరగతి బోర్డు పరీక్షలో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments