Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ వివేకా హత్య కేసు : సీబీఐ అధికారుల ఎదుట ఏపీ సీఎంవో ఓఎస్డీ

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (14:36 IST)
మాజీ మంత్రి, వైకాపా నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఇపుడు వేగవంతమైంది. ఇటీవల వైకాపాకు చెందిన కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి వద్ద సీబీఐ విచారణ జరిపింది. ఈ విచారణ తర్వాత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణి వైఎస్ భారతీ పీఏ నవీన్‌‍లకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. 
 
ఈ క్రమంలో కృష్ణమోహన్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో సీబీఐ అధికారుల శుక్రవారం ఎదుట హాజరయ్యారు. ఆయనను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సీబీఐ నోటీసుల నేపత్యంలో నవీన్ కూడా కడపకు చేరుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి విచారణ ముగిసిన తర్వాత నవీన్‌ను కూడా విచారించే అవకాశం ఉంది. 
 
కాగా, వివేహా హత్య తర్వాత అవినాశ్ రెడ్డి ఫోన్ నుంచి నవీన్, కృష్ణమోహన్ రెడ్డిలకు అత్యధిక సంఖ్యలో కాల్స్ వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. కృష్ణమోహన్ రెడ్డికి వైఎస్‌తో ఎంతో సాన్నిహిత్యం ఉంది. వైఎస్ హయాంలో ఆయన. పులివెందుల ఓఎస్డీగా వ్యవహరించారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎంవోలో కీలక స్థానంలోకి వచ్చారు సీఎం జగన్‌కు వచ్చే కాల్స్ మొదట కృష్ణమోహన్ రెడ్డిని స్వీకరిస్తారని సమాచారం. 

సంబంధిత వార్తలు

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

పవన్ కుమార్ కొత్తూరి - యావరేజ్ స్టూడెంట్ నాని - బోల్డ్ ఫస్ట్ లుక్

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments