Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం : జగన్ సర్కారు నిర్ణయం

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2022 (19:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేధం విధించింది. ఈ మేరకు గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. నవంబరు ఒకటో తేదీ నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
అలాగే, ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల ఉత్పత్తి, దిగుమతికి అనుమతి లేదని తెలిపింది. ప్లాస్టిక్‌ ఫ్లెక్సీల వినియోగం, ముద్రణ, రవాణా, ప్రదర్శన పైనా నిషేధం విధించింది. ఈ నిషేధం అమలులో నగరాలు, పట్టణాల్లో అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించింది. 
 
గ్రామాల్లో ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని ప్రభుత్వం స్పష్టంచేసింది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. 
 
ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జీవో జారీ చేసింది. నిషేధం అమలును పోలీస్‌, రవాణా, జీఎస్టీ అధికారులు పర్యవేక్షించాలని తెలిపింది. ప్లాస్టిక్‌కు బదులుగా కాటన్‌, నేత వస్త్రాలు వాడాలంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments