Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏడాదిన్న‌ర జ‌గ‌న్ సొంత బ్రాండ్లు... ఇక‌పై ప్రీమియం బాండ్లు...మందు మ‌యం!

Webdunia
శుక్రవారం, 31 డిశెంబరు 2021 (19:41 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అంతా మందు మ‌యంగా ఉంద‌ని, మందు బాబులను ఆకట్టుకుంటూ, వైసీపీ, బీజేపీలు ముందుకు వెళుతున్నాయ‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. మ‌ద్యం ప్రియుల ఓట్లు ప‌డితే గెలిచిపోతామ‌ని బీజేపీ భావిస్తుంటే, మందుబాబుల‌కు వ‌చ్చిన కష్టం ఇపుడు తొల‌గేలా వైసీపీ చూసుకుంటోంద‌న్నారు.
 
 
బిజెపి అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ రూ.70 లకు అమ్మిస్తానని సారాయి వీర్రాజు మేనిఫెస్టోలో పెడతామంటున్నారని, అందుకే బ‌హిరంగ స‌భ‌లో మ‌రీ చెప్పార‌ని పేర్కొన్నారు. రెండున్నరేళ్లు సొంత బ్రాండ్ లు అమ్మిన జగన్ సర్కార్ ఇప్పుడు ప్రీమియం బ్రాండ్లు అమ్ముతామంటోందని హేళ‌న చేశారు.
 
మద్య నిషేధం, దశలవారీ మద్య నియంత్రణ హామీలను వైసీపీ ప్రభుత్వం తుంగలో తొక్కిందని సిపిఐ నేత ర‌మ‌కృష్ణ విమ‌ర్శించారు. మొత్తం మీద వైసిపి, బీజేపీలు మందుబాబుల ఓట్లు కొల్లగొట్టేందుకు పథక రచన చేస్తున్నాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments