Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమూల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సీఎం జగన్‌: ధూళిపాళ్ల నరేంద్ర

Advertiesment
అమూల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సీఎం జగన్‌: ధూళిపాళ్ల నరేంద్ర
విజ‌య‌వాడ‌ , గురువారం, 30 డిశెంబరు 2021 (15:01 IST)
లీటరు పాలకు రూ.4 బోనస్‌ ఇస్తామని ప్రకటించిన సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ఎందుకు ఇవ్వడంలేదని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. అసత్యాలతో రాష్ట్రంలోని పాడి రైతులను సీఎం జగన్‌ మోసం చేస్తున్నారని  ధ్వజమెత్తారు. అమూల్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా సీఎం జగన్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు.
 
 
1950-60వ దశకాల్లో ప్రారంభమైన పాడి రైతుల సహకార సమాఖ్యల మూసివేతకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. సీఎం జగన్‌  అమూల్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ, ఏపీలోని పాల డెయిరీలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఒంగోలు డెయిరీ మూతపడినా పట్టించుకోని సీఎం అమూల్‌ కోసం రూ.2,500 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. మూతపడే స్థితిలో ఉన్న నెల్లూరు డెయిరీని ఎందుకు కాపాడటం లేదని నిలదీశారు.
 
 
‘‘దాదాపు 30వేల మంది రైతుల నుంచి 168లక్షల లీటర్ల పాలను అమూల్‌ సేకరిస్తోందని, రూ.71 కోట్లను పాడి రైతులకు అందించిందని జగన్‌ చెబుతున్నారు. సీఎం చెప్పిన లెక్క ప్రకారం అమూల్‌ సంస్థ లీటరు పాలకు రూ.42.50 పైసలు చెల్లిస్తుంటే, సీఎం జగన్‌ రూ.70 అని చెప్పడం అబద్ధం కాదా?. విజయడెయిరీ 11శాతమున్న లీటరు పాలకు రూ.85.55 పైసలు ఇస్తుంటే, అమూల్‌ సంస్థ ఇస్తున్నది కేవలం రూ.77 మాత్రమే. రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తున్న అమూల్‌ డెయిరీ వల్ల రాష్ట్రానికి అప్పులే మిగులుతాయి. 
 
 
కృష్ణా మిల్క్‌ యూనియన్‌ సహా, రాష్ట్రంలోని మిల్క్‌ డెయిరీలను నిర్వీర్యం చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం’’ అని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. 1950-60వ దశకాల్లో ప్రారంభమైన పాడి రైతుల సహకార సమాఖ్యల మూసివేతకు ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌  అమూల్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ, ఏపీలోని పాల డెయిరీలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఒంగోలు డెయిరీ మూతపడినా పట్టించుకోని సీఎం అమూల్‌ కోసం రూ.2,500 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. మూతపడే స్థితిలో ఉన్న నెల్లూరు డెయిరీని ఎందుకు కాపాడటం లేదని నిలదీశారు.
 
 
‘‘దాదాపు 30వేల మంది రైతుల నుంచి 168లక్షల లీటర్ల పాలను అమూల్‌ సేకరిస్తోందని, రూ.71 కోట్లను పాడి రైతులకు అందించిందని జగన్‌ చెబుతున్నారు. సీఎం చెప్పిన లెక్క ప్రకారం అమూల్‌ సంస్థ లీటరు పాలకు రూ.42.50 పైసలు చెల్లిస్తుంటే, సీఎం జగన్‌ రూ.70 అని చెప్పడం అబద్ధం కాదా?. విజయడెయిరీ 11శాతమున్న లీటరు పాలకు రూ.85.55 పైసలు ఇస్తుంటే, అమూల్‌ సంస్థ ఇస్తున్నది కేవలం రూ.77 మాత్రమే. రూపాయి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేస్తున్న అమూల్‌ డెయిరీ వల్ల రాష్ట్రానికి అప్పులే మిగులుతాయి. కృష్ణా మిల్క్‌ యూనియన్‌ సహా, రాష్ట్రంలోని మిల్క్‌ డెయిరీలను నిర్వీర్యం చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం’’ అని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో ఎర్రచందనం దుంగల‌ స్వాధీనం