అసైన్డ్ భూముల రాజకీయం : వైకాపా ఎమ్మెల్యేకు సీఐడీ నోటీసులు

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (07:50 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి అసైన్డ్ భూముల అంశంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీఐడీ... టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు నోటీసులు జారీ చేసింది.
 
తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా సీఐడీ అధికారులు నోటీసులు పంపారు. సీర్పీసీసీ సెక్షన్ 160 కింద నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 11 గంటలకు విజయవాడ సీఐడీ కార్యాలయంలో హాజరు కావాలని ఎమ్మెల్యేకి స్పష్టం చేశారు.
 
కాగా ఈ అంశంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. సీఎం జగన్‌కు ఎవరిపైనా కక్ష సాధించాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. అమరావతి భూముల అంశంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా సీఐడీ ముందు హాజరై వివరణ ఇస్తారని వెల్లడించారు.
 
మరోవైపు, ఈ అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారు. నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ సహా మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. నారాయణకు చెందిన కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగాయి. 
 
ఏక కాలంలో అన్ని చోట్ల సోదాలు చేపట్టగా, ఇన్ని చోట్ల ఒకేసారి సోదాలు జరుగుతుండటం సంచలనంగా మారింది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారాయణకు సీఐడీ అధికారులు మంగళవారం నోటీసులు అందజేశారు. ఈ నెల 23న విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నారాయణ ఇంట్లో సీఐడీ సోదాలు జరుపుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments