Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విధ్వంసాలు తప్ప రాష్ర్టంలో ఏమైనా అభివృద్ది ఉందా? : ఏలూరి సాంబశివరావు

Advertiesment
Eluri Sambasiva Rao
, బుధవారం, 17 మార్చి 2021 (15:57 IST)
వైసీపీ ప్రభుత్వ అరాచాకాలకు, కక్ష్యసాధింపు చర్యలకు రోజురోజుకీ హద్దులేకుండా పోతున్నాయని ఏలూరు మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి ఏలూరి సాంబశివరావు ఆరోపించారు. అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో నారా చంద్రబాబునాయుడికి సీఐడీ నోటీసులు ఇవ్వటం వైసీపీ కుట్రలోభాగమనిని ఆరోపించారు. 
 
తన రాజకీయజీవితంలో ఎలాంటి అవినీతి మరకలు లేని చంద్రబాబు నాయుడిని అవినీతిపరుడిగా చిత్రీకరించాలని వైసీపీ పడుతున్న ఆరాటం చూస్తుంటే జాలేస్తోంది. ఆకాశంపై ఉమ్ము వేస్తే తిరిగి మెఖంపైనే పడుతుందన్న సంగతి వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలి. జగన్మోహరెడ్డి కక్ష్యసాధింపులపై పెట్టిన శ్రద్ద రాష్ట్రాభివృద్దిపై చూపితే రాష్ట్రంలో రెండేళ్లలో కనీసం 2 శాతమన్నా అభివృద్ది జరిగివుండేది. 22 నెలల్లో అక్రమ కేసులు, విధ్వంసాలు తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? అని నిలదీశారు. 
 
వైసీపీ ప్రభుత్వ వ్యవహారశైలితో అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు. మీరు చేస్తున్న విద్వంసాలకు భయపడి  పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టేందుకు పెట్టుబడిదారులు ముందుకు రావటం లేదు. రాష్ట్రాభివృద్ధిని గాలికొదిలేసి కేసులు, కక్షలతో సరిపెడుతున్నారు. ప్రగలూ.. ప్రతీకారాలు యువతకు ఉద్యోగాలు, రాష్ట్రానికి అభివృద్ధి సాధించి పెడుతుందా? జగన్ రెడ్డిపై ఉన్న కేసుల దృష్టిని మళ్లించేందుకు నాటకాలు ఆడుతున్నారు. 
 
దళితుల భూములను బలవంతంగా లాక్కున్న చరిత్ర వైయస్ కుటుంబానికే దక్కుతుంది. అధికార మదంతో వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలియడం లేదు. అధికారం ఉందని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. నీలి మీడియాలో అసత్యాలు రాస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే పొరబాటే. 22 నెలలుగా కనబడని అక్రమాలు వైసీపీ కంటికి ఇప్పుడు కనిపించాయంటే కుట్రకోణం కాక మరేముంటుంది? రాజారెడ్డి రాజ్యాంగం అమలుతో అధికారులు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అక్రమ కేసులు చంద్రబాబును ఏమీ చేయలేవని ఏలూరి సాంబశివరావు అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోకాళ్ల పైన చింపుకుని శరీరాన్ని చూపుతూ సమాజానికి ఏం సందేశం ఇద్దామని? సీఎం ప్రశ్న